Monday, April 29, 2024

అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

- Advertisement -
- Advertisement -

ములుగు : అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి త్యాగాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయని తెలంగాణ రాష్ట్రం త్యాగాలను ఎల్లవేళలా స్మరించుకుంటుందని ములుగు జడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరుల సంస్మరణ దినం సందర్భంగా జడ్పి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొదటగా అమర జ్యోతి వెలిగించి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అమరుల సంస్మరణ తీర్మాణాన్ని ములుగు జడ్పిటిసి సకినాల భవాని ప్రవేశపెట్టగా ములుగు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తుమ్మల హరిబాబు బలపరచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా జడ్పి చైర్‌పర్సన్ మాట్లాడుతూ అమరుల త్యాగాల పునాదులుగా సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరానిస్తున్నదన్నారు.

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే అక్కున చేర్చుకుందని, అమరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన విషయం గుర్తు చేశారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిపేలా సాగుతున్న పాలనపై అమరుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

నీళ్లు, నిదులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సకినాల భవానీ, గై రుద్రమాదేవి, తుమ్మల హరిబాబు, పాయం రమణ, కరం చందుగాంధీ, కోఆప్షన్ సభ్యులు వలియాబి, రియాజ్మీర్జా, ఎంపిపి బుర్ర రజిత సమ్మయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, అధికారులు జడ్పి సిఈఓ ప్రసూనారాణి, డిప్యూటీ సిఈఓ రమాదేవి, డిఎంహెచ్‌ఓ అప్పయ్య, పిఆర్ ఈఈ దిలీప్, విద్యాశాఖ బద్దం సుదర్శన్‌రెడ్డి, డిడబ్లూఓ ప్రేమలత, డిపిఓ వెంకయ్య, ఎస్‌సి కార్పొరేషన్ ఈడి తుల రవి, విద్యుత్‌శాఖ డిఈఈ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News