Friday, April 26, 2024

 రంగంలోకి యువతరం

- Advertisement -
- Advertisement -

MBBS Students treatment to covid patients

న్యూఢిల్లీ: కరోనాపై పోరును క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేసేందుకు కేంద్రం వినూత్న పద్ధతిని ఎంచుకుంది. ఎంబిబిఎస్ విద్యార్థులను రంగంలోకి దింపి కరోనా మహమ్మారిని అరికట్టించడంలో ఉన్న మానవ వనరుల ఇబ్బందులను తొలిగించుకోవాలని సంకల్పించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ నియంత్రణ దిశలో తీసుకోవల్సిన చర్యలకు మరింత పదును పెట్టాలని సంకల్పించారు. ఎంబిబిఎస్ చివరి సంవత్సరం, తరువాతి దశలోని హౌస్‌సర్జన్ స్థాయి విద్యార్థులకు బాధ్యతలు అప్పగించాలని ప్రధాని సారథ్యపు సమీక్ష కమిటీ నిర్ణయించింది.ఎంబిబిఎస్ చదివి ఇకపై డాక్టర్లుగా రాబోతున్న యువతరం వారి సేవలను తీవ్రస్థాయి కొవిడ్‌పై పోరుకు సద్వినియోగించుకోవాలని తలపెట్టారు.

విద్యార్థులు ఎంబిబిఎస్ అయిన తరువాత వారివారి ఫ్యాకుల్టీల సారథ్యంలో కరోనా రోగుల చికిత్సకు సేవలకు దిగడం వల్ల సంబంధిత వైరస్‌ను అరికట్టే విషయంలో వారికి సరైన అనుభవం దక్కుతుంది. ఇటువంటి విద్యార్థులకు భవిష్యత్తులో ప్రభుత్వోద్యోగాలలో అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారు. వీరు ఆసుపత్రులలో కరోనా రోగుల చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వీరికి తక్షణకు వ్యాక్సిన్ల్ వేయించాలని నిర్ణయించారు. ఇక ఇదే వరుసలో ఎంబిబిఎస్ విద్యార్థులు పిజికి వెంటనే వెళ్లేందుకు సన్నాహాలు చేసుకోకుండా నీట్ పరీక్షలను నాలుగు నెలల వరకూ నిలిపివేసేందుకు ఈ కమిటీ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు. పైగా వైరస్ ఉధృతి ఉన్నందున ఇప్పట్లో పరీక్షల సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ లోగా లక్షలాది మంది వరకూ ఉండే ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కీలక బాధ్యతలను అప్పగించడం వల్ల ఇటువంటి వైరస్‌ను ఆటకట్టించే దిశలో వారి అనుభవం భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందని అత్యున్నత స్థాయి కమిటీ అభిప్రాయపడింది.

వీరి ఆలోచలను నిపుణుల సలహాలను ప్రధాని మోడీ వెంటనే అంగీకరించినట్లు వెల్లడైంది. కొవిడ్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటం, క్లిష్టమైన కేసులతో ప్రస్తుతం దేశ ఆరోగ్యచికిత్స వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి డాక్టర్లు, నర్సుల కొరత ఉండటంతో నెలలు రోజుల తరబడి ఎక్కువకాలం ఒక్కరే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. మానవ వనరుల కొరత ఉండటం చివరికి కరోనా చికిత్సకు గండిపడటానికి దారితీసి మానవ ప్రాణాలకు ముప్పు అవుతోంది.ఫైనల్ ఇయర్ ఎంబిబిఎస్ విద్యార్థులను ముందుగా టెలి కన్సల్టెషన్ వైద్య ప్రక్రియకు వినియోగించుకుంటారు. స్వల్పస్థాయి కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి చికిత్స విషయంలో వీరిని రంగంలోకి దింపుతారు. వీరికి ఎప్పటికప్పుడు ఎంబిబిఎస్ ఫ్యాక్టుల్టీ నుంచి సాయం అందుతుంది. ఇక నర్సు డిగ్రీ కోర్సుల పూర్తిదశలో ఉన్నవారిని,సంబంధిత డిప్లోమాలు పూర్తి చేసిన వారిని, మెడికల్ ఇంటర్న్‌ను వెంటనే కరొనా రోగుల చికిత్సకు రంగంలోకి దింపడం వల్ల ఇప్పటి వరకూ ఈ బాధ్యతలలో ఉన్న వైద్యులు, చికిత్సా సిబ్బందిపై భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రధాని ఆధ్వర్యపు కమిటీ తీసుకున్న నిర్ణయాల వివరాల గురించి తరువాత ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీటులో వెలువరించింది.

ఎంబిబిఎస్ విద్యార్థులతో పాటు బిఎస్‌సి/జిఎన్‌ఎం క్వాలిఫైడ్ నర్సులను పూర్తిస్థాయి కొవిడ్ డ్యూటీలలో తీసుకుని వారు సీనియర్ డాక్టర్లు, నర్సుల ఆధ్వర్యంలో పనిచేయడం ద్వారా ఆసుపత్రులలో అదనపు చికిత్స సిబ్బంది ఏర్పడుతుంది. ఎవరు కొవిడ్ చికిత్స విభాగాలలో ఉన్నా వారికి సరైన బీమా ఏర్పాట్లు ఉంటాయి. కోవిడ్ రోగుల చికిత్సలో వందరోజుల సేవల కాలాన్ని పూర్తి చేసుకున్న వైద్య సిబ్బందికి గుర్తింపుగా ప్రధాన మంత్రి నుంచి విశిష్ట కొవిడ్ జాతీయ సేవల సమ్మాన్ పతకాలు అందిస్తారు. వీరికి తరువాతి దశలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తారని , ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారని పిఎంఒ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News