Monday, April 29, 2024

దోమను తరిమేద్దాం

- Advertisement -
- Advertisement -
Measures for control of seasonal Diseases

 

రానున్నది వర్షాకాలం, ముందస్తు చర్యలతో వ్యాధులను కట్టడి చేయాలి
శానిటేషన్ స్ప్రేయింగ్ ఐదురెట్లు పెంచాలి : బల్దియా సమీక్షలో కెటిఆర్
కరోనా నియంత్రణలో జిహెచ్‌ఎంసి భేష్ : మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్నది వర్షకాలం కావడంతో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ము ందస్తు చర్యలు తీసుకోవడంతో పా టు ప్రస్తుతం కొనసాగిస్తున్న శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను మ రో 5 రేట్లు పెంచాలని జిహెచ్‌ఎంసి అధికారులను పురపాలక మంత్రి కె టిఆర్ అదేశించారు. సోమవారం జి హెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్‌లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగర మేయర్ బొం తు రామ్మోహన్, డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జి హెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, సెక్రటరీ సుదర్శన్‌రెడ్డి, జ లమండలి ఎండి ఎం.దానకిశోర్, ఇవిఎండి డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఎంటమాలజి అధికారులతోజోనల్, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్న ఈ సమావేశంలో సీజినల్ వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కెటిఆర్ వారికి దిశా నిర్ధేశం చేశారు.

దోమల నియంత్రణకు చర్యలు : మంత్రి కెటిఆర్

మరో నెల రోజుల్లో వర్షాల ఉధృతి పెరగనుండడంతో ఇప్పటి నుంచే దోమల నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రజా కోణంలో ఆలోచించి వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలని సూచించారు. దోమల నివారణకు ఎంటమాలజీ విభాగంలో ఉన్న 2,412 మంది సిబ్బందితో యాంటి లార్వా ఫాగింగ్‌కు వినియోగిస్తున్న 2200 యంత్రాలనును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కెటిఆర్ సూచించారు. ఆయా జోన్లలో ఉన్నపరిస్థితుల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో అవసరమైన మేరకు అదనంగా యాంటి లార్వా ఫాగింగ్ యంత్రాలను సమాకూర్చుకుని ప్రతి 5 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా నెలలో 5 విడుతలు యాంటి లార్వాస్ప్రేయింగ్ చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. అంతేకాకుండా గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడమేకాకుండా ఇంటెన్సీవ్ శానిటేషన్, యాంటి లార్వా స్ప్రేయింగ్ చేయాలని తెలిపారు.

అదేవిధంగా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే కొనసాగించాలని, ఇఎండిఎం విభాగానికి సూచించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సర్కిల్ స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లతో దోమల నివారణతో పాటు విషజర్వాలపై చైతన్యపర్చాలని డిప్యూటీ కమిషనర్లను మంత్రి అదేశించారు.

ప్రధాన నాలాల పూడిక తీత పనులతో పాటు చెరువులు, కుంటల్లో పెరిగిన గుర్రపుడెక్కను తొలగించేందుకు ప్రతి జోన్‌కు ఇక ప్లొటింగ్ ట్రాష్ కలెక్టర్ యంత్రాన్ని కేటాయించాలని సూచించారు. రోడ్లపై నీరు నిల్వకుండా సరి చేయడంతోపాటు గుంతలను పూడ్చేందుకు ఇన్‌స్టెంట్ రిపేర్ బృందాలను రంగంలోకి దింపడం, మ్యాన్‌హొల్స్‌పై ప్రమాదాల నివారణ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన ఘన వ్యర్ధాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని,ఈ ఖర్చులను ఆయా ప్లాట్ల యజమనానుల నుంచే వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 123 బస్తీ దవాఖానాలకు అదనంగా మరో 44 దవాఖానాలను త్వరలోనే ప్రాంరంభించనునట్లు కెటిఆర్ తెలిపారు.

బల్దియా సేవలు భేష్ : మంత్రి ఈటల రాజేందర్

కరోనా వైరస్ నియంత్రణకు గత రెండు నెలలుగా వైద్య సిబ్బందితో కలసి మున్సిపల్ అధికారులు, సిబ్బంది గొప్ప సేవలను అందిస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కితాబు ఇచ్చారు. వ్యాధి చికిత్స కంటే నివారణే ముఖ్యమని, సీజనల్ వ్యాధుల నివారణకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ముందస్తూ ప్రణాళికలను సిద్దం చేసి అందరిని సమాయత్తం చేయడం మంచి పరిణామమని ఈటల పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిహెచ్‌ఎంసి, జలమండలి సమన్యవంతో పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News