Sunday, May 12, 2024

లైక్ ఎ మాంక్

- Advertisement -
- Advertisement -

Megastar Chiranjeevi New Look viral

మెసాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే గురువారం చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘కెన్ ఐ థింక్ లైక్ ఎ మాంక్?’ అంటూ ఈ స్టిల్‌ను పోస్ట్ చేశాడు. అయితే ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి గుండు చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. చిరు ఈ కొత్త లుక్ అభిమానులకు కొత్త అనుభూతినిస్తోంది. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

Megastar Chiranjeevi New Look viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News