Sunday, April 28, 2024

మానసిక రుగ్మతలు వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌తో నివారించవచ్చు: జెడి లక్ష్మీనారాయణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: నేటి ఆధునిక జీవన శైలిలో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సిబిఐ మాజీ జెడి వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆస్టర్ ప్రైమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు, చదువులలో నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు దురదృష్టవంతులు ఈ ఒత్తిడిని ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీరందరికీ సరైన సమయంలో నిపుణులైన మానసిక వైద్యుల ద్వారా చికిత్స, కౌన్సిలింగ్ అందజేసినట్లయింతే వీటిని నివారించవచ్చని చెప్పారు. అంతే గాకుండా మద్యం, డ్రగ్స్ లాంటి అలవాట్ల కారణంగా ఎందరో సాధారణ జీవితాన్ని గడపలేని స్థితికి వస్తున్నారని వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఆస్టర్ ప్రైమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ పేరుతో మానసిక చికిత్సకు సంబంధించి ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ క్లినిక్ ద్వారా మానసిక వ్యాధులు, రుగ్మతలతో భాదపడే వారికే కాకుండా న్యూరో సంబంధిత వ్యాధుల కారణంగా ఇబ్బంది పడే వారి ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్టర్ ప్రైమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కు సంబంధించిన వివరాలను వెల్లడించిన వైద్యులు ఎన్నో మానసిక రోగాలు, రుగ్మతలకు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. మానసిక వ్యాధులు, రుగ్మతలకు సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డా. జాన్సే థామస్, డా. నిథిన్ కొండాపురం, డా. శివ అనూప్ యెల్లా, డీ అడిక్షన్ స్పెషలిస్టులతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News