Thursday, May 16, 2024

వలసల బాధలకు అంతులేదా…..

- Advertisement -
- Advertisement -

కరోనా వైరస్ వలస కూలీలకు శాపంగా మారింది…..

ప్రాణాలు సైతం కోల్పోతున్న సందర్భాలు కొకొల్లలు….

రోడ్డు ప్రమాదాలతోల వలసల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి…

వలసల కష్టాలు తీరే సమయం వస్తుందా?…..

Migrant workers by foot on national highways

 

మనతెలంగాణ / బోధన్‌రూరల్: వలసల బాధలకు అంతు లేదనే చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కరోన వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అనేకమంది వలసదారులు నానా కష్టాలకు గురవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ సరిహద్దు ప్రాంతాల వరకు చేరవేస్తున్న ఇతర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలని చెక్‌పోస్ట్‌ల వద్ద ఇబ్బందులు ఎదురుకోక తప్పడం లేదు. అన్ని అనుమతులు ఉన్నప్పటికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్న పిల్లలు సైతం పాదరక్షలు లేకుండా మండుటెండల్లో రోడ్లపై కాలినడకన ప్రయాణిస్తున్నారు. దాతలు కొందరు నిత్యవసర వస్తువులను అందించడంతో వలసలు రోడ్లపక్కన వంట చేసుకుని కడుపు నింపుకుంటున్నారు. బోధన్ ప్రాంతంలోని సాలూరా అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద భోజనాలు ఏర్పాటు చేసి వలస ఆకలి తీర్చుతున్నారు. రోడ్లపై కాలినడకన వెళుతున్న ఏ వాహనం ఎక్కడ నుండి వచ్చి ఢీకొడుతుందోనని వలస కార్మికులు బిక్కు బిక్కు మంటు జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నారు. ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు.

వలసలను వారి స్వస్థలాలకు చేర్చడానికి ప్రభుత్వాలు వారి సాయశక్తుల కృషి చేస్తున్నారు. అయినప్పటికి వలసలదారులు అధికమవ్వడంతో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వలసలకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారా? ఏది ఏమైనప్పటికి వలసలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని ప్రయాణించే సందర్భాలే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాలలో వలసలు స్థానికంగా ఉంటు పనులు చేసుకుంటున్న వారికి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాయి. స్వస్థలాలకు దారి పట్టిన వలసలకు ఏ విధంగా న్యాయం చేకూరుతుందో వేచిచూడాల్సిందే. ఇప్పటి కైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రతి రాష్ట్ర నుంచి పది రైళ్లను నడిపిస్తే సరిపోతుందని వలసదారులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News