Saturday, May 11, 2024

జూన్‌టీన్త్ వేడుకల్లో కాల్పులు.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మిల్‌వాకీ (అమెరికా): గ్రేటర్ ఫిలడెల్ఫియా చర్చి బయట సోమవారం మధ్యాహ్నం మిల్‌వాకీ జూన్‌టీన్త్ వేడుకల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఆరుగురు యువకులు కాల్పులకు బలై ప్రాణాలు కోల్పోయారు. మిల్‌వాకీ పోలీస్ చీఫ్ జెఫ్రీ నార్మన్ వెల్లడించిన వివరాల ప్రకారం పోలీస్‌ల కస్టడీలో ఉండగా అనుమానితుడు, సాయుధుడైన 17 ఏళ్ల యువకుడు కూడా మృతి చెందాడు. కాల్పులకు పాల్పడిన వారికోసం గాలిస్తున్నామని జెఫ్రీ నార్మన్ చెప్పారు.

మృతుల్లో నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వీరంతా 14 నుంచి 19 ఏళ్ల లోపు వారే. కొంతమంది బాలికలు, యువతుల మధ్య కొట్లాటే ఈ సంఘటనకు కారణమైందని నార్మన్ తెలిపారు. అయితే కొట్లాటకు కారణమేమిటో తెలియదు. మరికొందరికి ఈ సంఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. అమెరికాలో వారాంతపు రోజుల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగడం గన్‌కల్చర్‌గా మారుతోంది.

ప్రశాంతంగా సరదాగా జరగాల్సిన జూన్‌టీన్త్ వేడుకలు అవాంఛనీయ సంఘటనలకు దారి తీయడంపై పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు యువతుల మధ్య కొట్లాట కాల్పులకు దారి తీసిందని, ఒక యువకుడు తుపాకీ బయటకు తీసి కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోందని జెఫ్రీ నార్మన్ పేర్కొన్నారు. తుపాకీ కాల్పుల గాయాలకు ఇద్దరు యువకులు చికిత్స తీసుకోవడం కనిపించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News