Monday, April 29, 2024

దేశానికి మార్గదర్శకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించే పార్లమెంటు భవనానికి డా. బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం చేకూర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు అంబేద్కర్ విగ్రహాన్ని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామపంచాయతీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి గంగుల, రసమయి బాలకిషన్ డప్పు వాయించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికే మార్గదర్శకుడని… ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అంబేద్కర్ పేరు చెప్పుకొని కేంద్రంలో రాష్ట్రంలో అధికారుల వచ్చిన బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఆయన పేరును వాడుకున్నారే తప్ప ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. సమైక్య రాష్ట్రంలో దళితుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని… దళిత బంధు అనే గొప్ప పథకం ప్రవేశపెట్టారని మంత్రి గుర్తు చేశారు. బిజెపి నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో నిర్మించే పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఐక్యరాజ్య సమితి సైతం శభాష్ అనే విధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించారని మంత్రి గుర్తు చేశారు. దేశానికి మార్గదర్శకుడు అంబేద్కర్ అని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు. ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కెసిఆర్ నాయకత్వంలోతెలంగాణ అన్ని రంగాల్లో ముందుందని, రాష్ట్రంలో 24 గంటల కరెంటు తో పాటు సాగు తాగునీరు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ సంపాదన దోచుకునేందుకు సమైక్య పాలకులు పాదయాత్రల పేరుతో మరోసారి కుట్రలకు తెరలేరుతున్నారని పేర్కొన్నారు. చేకుర్తి గ్రామస్తుల చిరకాల వాంఛ అయిన చేకుర్తి మగ్దంపూర్ రోడ్డుకు త్వరలో నిధులు కేటాయించుతామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, రసమయి బాలకిషన్, అరుణ రాజయ్య, ఎంపిటిసి ఎలుక పెళ్లి స్వరూప మోహన్, ఉపసర్పంచ్ గాండ్ల విజయ అంజయ్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ కన్వీనర్ గాలి పెళ్లి రాజా లింగం, చమనపల్లి చంద్రశేఖర్ మేడి మహేష్ సముద్రాల అజయ్, కంసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News