Monday, April 29, 2024

రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా బిజెపి లేవదు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో 100 పడకల ఆస్పత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. భూమిపూజలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. బాజిరెడ్డి పట్టుపట్టి 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయించారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. బాజిరెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రిలో సూది ఉంటే మందు లేని పరిస్థితి ఉండేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బిడి పరిశ్రమను దెబ్బతీయడానికే జీఎస్ టి వేశారని ఆయన మండిపడ్డారు.

మహిళా బిడి కార్మికులకు ఫించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. మందుల్లేక నాంథేడ్ ఆస్పత్రిలో చిన్నారులు ఎందుకు చనిపోయారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా బిజెపి లేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సూచించారు. తప్పుడు సర్వేలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు పంపిణీ చేయలేకపోక కాంగ్రెస్ చతికిలపడిపోయిందని హరీశ్ విమర్శించారు. బిఆర్ఎస్ టికెట్లురాని వారిని కాంగ్రెస్ చేర్చుకుంటోందని హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News