Monday, April 29, 2024

మోడీ ‘మొండిచేయి’

- Advertisement -
- Advertisement -

Minister Harish rao fires on Modi

తెలంగాణకు ఒక్క వరమూ ఇవ్వలేదు

8ఏళ్లలో చేసిందేంటో కూడా చెప్పలేదు
రైతుల కోసం ఏదైనా ప్రకటిస్తారని ఆశించాం
మహిళా, గిరిజన రిజర్వేషన్ల సంగతేమైంది?
మేడారం జాతరకు జాతీయ హోదా ఏది?
బుల్లెట్ రైలు గుజరాత్‌కేనా? : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని న రేంద్రమోడీ రాష్ట్రానికి మరోసారి మొండి చేయి చూపించారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఏం ఇచ్చారని సిఎం కెసిఆర్ పలుమార్లు నిలదీస్తే వాటిల్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. వాస్తానికి రాష్ట్రానికి ఏమైనా కేంద్రం చేస్తేనే కదా అంటూ ఎద్దేవా చేశారు. వాళ్ల దగ్గర చెప్పడానికి ఏమీ లేని కారణంగా ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ అన్ని సొల్లు కబుర్లు చెప్పారని విమర్శించారు. ఈ మేరకు మోడీపై ఆరోపణలు గుప్పిస్తూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. బహిరంగ సభలో మోడీ అన్ని అబద్దాలు చెప్పారని వ్యాఖ్యానించారు. నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెబుతున్న మోడీ గడిచిన నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) తీసుకునేందుకు నిరాకరిస్తున్నదని, విలువ రూ. 22వేల కోట్లు ఉంటుందని చెప్పారన్నారు. ఇదేనా మీ రైతు అనుకూలత మోడీ? అని ప్రశ్నించారు. రైతుల ధాన్యానికి సంబంధించి సిఎంఆర్ తీసుకుంటామని సభా వేదిక నుంచి ప్రకటిస్తారని ఆశించామన్నారు.

అయితే ఆ అంశంపై కనీసం ఊసెత్తలేదన్నారు. అలాగే మీ ప్రసంగంలో మహిళను ఉద్దరిస్తున్నట్టు చెప్పారని, అలాంటప్పుడు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎనిమిదేళ్లు అయినా ఎందుకు ఆమోదించలేదు? సమాధానం ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చి మా సిఎం కెసిఆర్ నిబద్దత చాటుకున్నారన్నారు. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని ’మీ కేంద్ర మంత్రులు విజయ సంకల్ప సభ వేదికగా చెప్పారు.. ఇది వినడానికి బాగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించామన్నారు. దాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీనిపై కూడా వేదికపై సమాధానం చెప్తారని మా గిరిజన సోదరులు భావించారన్నారు. కానీ వారి ఆశలు అడియాశలు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు అనుమతులు కూడా ఇవ్వలేదన్నారు. ఇక మేడారానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే గిరిజనులపై మీకు ఏ మాత్రం కనికరం లేదని తెలుస్తోందన్నారు.

పైగా తెలంగాణ రాష్ట్రం అంటే మీకెందుకు అంత వివక్ష అని హరీశ్‌రావు నిలదీశారు. మీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఎన్నో వరాలు ఇచ్చారు… అందులో కనీసం ఏ ఒక్కటైనా తెలంగాణకు ఇచ్చారా? ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాజ్‌కోట్‌కు ఎయిమ్స్, ్లట్ ట్రైన్ ఇచ్చారు….మరి మా రాష్ట్రానికి ఎందుకివ్వలేదన్నారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్‌కు ప్రత్యేకంగా రూ. 55వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా 9 మెడికల్ కాలేజీలు ఇచ్చారన్నారు. వీటితో పాటు కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇచ్చారన్నారు. కర్నాటకకు తూముకూర్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ, ముంబై బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్‌టైల్స్ మెగా ఇలా ఎన్నో ఇచ్చారన్నారు. మరి తెలంగాణకు కూడా అలాగే ఏమైనా ఇస్తారేమో అనుకున్నామన్నారు. కానీ మళ్లీ మొండి చెయ్యి ఇచ్చారని విమర్శించారు. ఒక్కటి కూడా ప్రజలకు పనికివచ్చే ప్రకటన చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News