Monday, April 29, 2024

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

Minister Satyendar Jain sent to 14 days Judicial Custody

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అక్కడి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై రేపు ఢిల్లీ కోర్టు వాదనలు విననుంది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30న సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16లో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు, షెల్ కంపెనీల నుంచి సుమారు రూ. 4.81కోట్ల వరకు ముట్టినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, ఇటీవల ఆయనను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశ పెట్టగా జూన్ 9వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా, దాన్ని జూన్ 13 వరకు పొడిగించింది. తాజాగా మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Minister Satyendar Jain sent to 14 days Judicial Custody

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News