Sunday, April 28, 2024

జూలై 5న బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం

- Advertisement -
- Advertisement -

Minister Talasani Srinivas Review Yellamma Kalyanam

ఏర్పాట్లపై మంత్రి తలసాని సమిక్ష

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్స ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షనిర్వహించారు. కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను ఆలయ ఆవరణలో ముందుగా మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆలయం వెనుక భాగంలో భక్తుల వసతి కోసంరూ. 3.20 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 5 వ తేదీన అమ్మవారి కళ్యాణం, 6 వ తేదీన రథోత్సవం ఉంటుందని తెలిపారు.

గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణోత్సవం ఆలయం ముందు నిర్మించిన రేకుల షెడ్డు క్రింద నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగాఅమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టివి లలో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణోత్సవానికి హజరైన భక్తులు వీక్షించేందుకు ఆలయ ప్రాంగణ పరిసరాలలో 6 ఎల్‌ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దర్శనం సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నమన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసంప్రత్యేక పోలీసు బలగాలను నియమించడంతో ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు సేవలు అందించే వాలంటీర్ లకు ప్రత్యేక పాస్ లను జారీ చేస్తామన్నారు.

అమ్మవారి కళ్యాణోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రాంతంలో ట్రాపిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా మొబైల్ ట్రాన్స్ ఫార్మర్‌లను అందుబాటులో ఉంటాయని చెప్పారు. జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వాటర్ ప్యాకేట్స్, వాటర్ బాటిల్స్ ను భక్తులకు అందిస్తారన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని వాటర్ వర్క్‌అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించడంతోపాటు భక్తుల కోసం టాయిలెట్లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహకులకు భోజనం అనంతరం ప్లేట్ లను వేసేందుకు సరిపడా ప్లాస్టిక్ కవర్లను అందించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ ఈఓ అన్నపూర్ణ,ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్ట్రీట్ లైట్ ఈఈ వెంకటేష్, వాటర్ వరక్స్ ఈఎన్‌సి కృష్ణ, జిఎం హరి శంకర్, పంజాగుట్ట ఎసిపి గణేష్, ఎస్‌ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు, ఆర్ అండ్ బి ఈఈ రవీందర్, ట్రాన్స్ కో డిఈ సుదీర్, ఆర్టీసీ డివిఎం శ్యామల, ఐఆండ్ పిఆర్. సిఐఈ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News