Friday, May 17, 2024

ఎంఎల్‌ఎ చెంప చెళ్లుమనిపించిన మహిళ

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదలు, కాలువులు ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇండ్లలోకి నీళ్లు రావడంతో తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి జననాయక్ పార్టీ ఎంఎల్‌ఎ ఈశ్వర్ సింగ్ వెళ్లారు. ఎంఎల్‌ఎ రాగానే స్థానికులు ప్రశ్నించారు. వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తున్నావని ఎంఎల్‌ఎను ప్రశ్నించారు. తనని పట్టించుకునే నాదూడే లేడన్నారు. అక్కడే ఉన్న మహిళ తీవ్ర ఆగ్రహంతో ఎంఎల్‌ఎ చెంప చెళ్లుమనిపించింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎంఎల్‌ఎ పక్కకు తీసుకెళ్లారు. అనంతరం సదరు ఎంఎల్‌ఎ మీడియాతో మాట్లాడారు. తాను సదరు మహిళను క్షమించానని, ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించారు.

Also Read:  చందమామ వస్తున్నాం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News