Monday, April 29, 2024

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

- Advertisement -
- Advertisement -

రాయికల్: ఇటీవల కురిసిన వర్షాలతో రాయికల్ పట్టణంలోని పలు కాలనీలు వరద నీటితో అతలాకుతలం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం విధితమే. ముంపునకు గురైన ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు సాయం అందించారు.

రాయికల్ పట్టణంలోని కేశవనగర్, మేదరివాడ, భీమన్నగుడి ఏరియాల్లో శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పర్యటించారు. పెద్ద చెరువు మత్తడిని, అక్కడ దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. ముంపునకు గురైన కాలనీల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఎవరు ఆదైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

భారీ వర్షాలతో ఇండ్లు కోల్పయిన బాధితులను ఆదుకుంటామని, పంటలు దెబ్బతిన్న వివరాలు అధికారులు సేకరిస్తున్నారని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ముంపుకు గురైన ప్రజలకు తగు విధంగా సాయం అందిస్తామని చెప్పారు. రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు పూర్తి నివేదిక అందించిన తర్వాత వాటిని బాగు చేస్తామని ఇప్పటికిప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టి రాకపోకాలను పునరుద్దరిస్తామని చెప్పారు.

వీరి వెంట మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్‌పర్శన్ గండ్ర రమాదేవి, ఎఎంసి చైర్‌పర్శన్ మారంపెల్లి రాణి, పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, తహసీల్దార్ ఎం.ఎ ఖయ్యుం, కమిషనర్ గంగుల సంతోష్‌కుమార్, కౌన్సిలర్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News