Monday, April 29, 2024

21న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Model Schools Entrance Test

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ -2021 పరీక్ష ఈ నెల 21వ తేదీన జరుగనుంది. 6వ తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పరీక్ష సమయంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News