Wednesday, May 1, 2024

దాచేస్తే దాగని రాఫెల్ గుట్టు!

- Advertisement -
- Advertisement -

Modi says Rafale deal is an agreement between the two govt

 

ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ ఆడిట్‌లో ఫ్రాన్సు అవినీతివ్యతిరేక సంస్థ, ‘ఏజెన్స్ ఫ్రాంకయిస్ యాంటికరప్షన్’ గుప్తా కుటుంబ దలాలీ సంస్థ డెఫ్సిస్ సొల్యూషన్స్‌కు రూ.9.8 కోట్ల అక్రమ చెల్లింపులు బయటపెట్టింది. డెఫ్సిస్, దసో సబ్ కాంట్రాక్టర్లలో ఒకటి. రక్షణ శాఖ కాంట్రాక్టర్ దేవ్ మోహన్ గుప్త కొడుకులు సుశాంత్, సుషేన్ వ్యాపార దళారీలు. సుషేన్ పలుకుబడిగల రక్షణరంగ వ్యాపారి. దసో, దాని రాడార్ తయారీ భాగస్వామి థేల్స్‌ల నుండి ఈయన రూ.9.8 కోట్ల కమిషన్ తీసుకున్నాడని పారిస్ అంతర్జాల పరిశోధక పత్రిక మీడియా పార్ట్ ప్రచురించింది. సుషేన్ గుప్తాను అగస్త్య వెస్టుల్యాండ్ కుంభకోణంలో మోడీ సర్కార్ 2019 మార్చిలో అరెస్టు చేసి వదిలేసింది. ఏ క్విడ్ ప్రొకొ కుదిరిందో? రఫెల్ డీల్ రెండు ప్రభుత్వాల ఒప్పందమన్నారు మోడీ. ప్రభుత్వాల మధ్య లంచాలుంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వ గుప్తా లంచ ప్రక్రియను మోడీ సొంతం చేసుకున్నారు.

రక్షణ మంత్రిత్వ రహస్య పత్రాలను గుప్త సంపాదించారు. దసో అధిక ధర పొందడానికి సహకరించారు. లంచం పొందారు. లంచం పంచారు. భారత అంతర్జాల పరిశోధక సంస్థ కోబ్రా పోస్ట్ దసో- గుప్త సంబంధాలను 2019లోనే బయటపెట్టింది. గుప్త- రాఫెల్ కుంభకోణ విషయం తెలిసినా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ పట్టించుకోలేదు. మోడీ హిందు జాతీయవాద పార్టీ బిజెపిని మచ్చిక చేసుకోడానికి థేల్స్ గుప్తాను వాడుకుందని ఫ్రాన్స్ అంతర్జాల పత్రిక ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ మే 2016 లోనే రాసింది. సుశాంత్, సుషేన్‌లకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాయుసేన ప్రధానాధికారి ఆరూప్ రాహాలతో సత్సంబంధాలున్నాయని పేర్కొంది. రాఫెల్ ఒప్పందంలో అవినీతి వ్యతిరేక నిబంధనలు తొలగించారు. ఈ విషయం తెలిస్తే నేను అంగీకరించేవాన్ని కాదని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే అన్నారు.

దసో నుండి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లు మొదటి నుండి వివాదాస్పదమే. 1998 వాజపేయి అణుపరీక్షలో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించిన ఏకైక, ప్రథమ పశ్చిమ దేశం ఫ్రాంస్. ఫ్రాంస్ నుండి 126 జెట్ల కొనుగోలు ప్రతిపాదన వాజపేయిదే. రాఫెల్ నిర్వహణ ఖర్చులెక్కువ. సాంకేతికత బదిలీ, హెచ్.ఎ.ఎల్.తో సంయుక్త ఉత్పత్తి, రూప కల్పనల్ నిరాకరణ నియమ విరుద్ధం. రక్షణ అధ్యయన, విశ్లేషణల కార్యాచరణ మండలి సభ్యులు ఎయిర్ మార్షల్ మాథేశ్వరన్ అన్నారు. ‘జెట్ల ధర దసోకు కానుక. అది 30% ధర పెంచుకోవచ్చు. ‘దక్షిణాసియా రక్షణ రంగ నిపుణులు మైఖేల్‌కు గెల్మన్ విశ్లేషించారు. ఒక జెట్ యుపిఎ ధర రూ.526 కోట్లు. మోడీ ధర రూ.1700 కోట్లు. 36 జెట్ల కొనుగోళ్ళ నష్టం 42.3 వేల కోట్లు. 126 జెట్లు కొంటే 1.48 లక్షల కోట్ల నష్టం.

కాంగ్రెస్ ధరతో పోల్చితే రూ.12,600 కోట్లు మిగిలిందన్నారు మోడీ. శిక్షణ, సంయుక్త్ తయారీ లేనందున 3 కోట్ల పని గంటలు మిగులుతాయని దసో అంచనా. 9 కోట్ల పని గంటలు మిగులుతాయని హెచ్.ఎ.ఎల్. అంచనా. దసోకు ఎంత లాభం! దసో పక్షాన్ ఫ్రాన్సు ప్రభుత్వ హామీ లేదు. మన ప్రభుత్వం హామీపత్రం ఇచ్చింది. దీంతో మిగిలిన రూ. 5 వేల కోట్లు దసోకు ఇచ్చారు. 2 జి స్పెక్ట్రం కుంభకోణంలో అధిక లబ్ధిదారుడైన అనిల్‌కు రాఫెల్ పరిహార భాగస్వామ్యం ఇచ్చారు? బ్రెజిల్, కెనడా, నెదర్లాండ్స్, నార్వే, దక్షిణ కొరియా, సింగపూర్, సౌదీ అరేబియా, మొరాకో దేశాలు రాఫెల్‌ను తిరస్కరించాయి. మన కొనుగోళ్లు లేకపోతే దసో మూతబడేది. ఈ సాకుతో తక్కువ ధరకు బేరమాడి ఉండవచ్చు.

ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ధర, బ్రెజిల్‌కు ఇవ్వజూపిన ధరల కంటే మన రాఫెల్ ధర ఎక్కువ. ధర ఎక్కువ, రాడార్ శక్తి తక్కువ, గాలి నుండి గాలిలోకి, గాలి నుండి భూమికి మారే వేగం తక్కువ, శిరస్త్రాణ లోపాల వల్ల బ్రెజిల్ రాఫెల్ ఒప్పందాన్ని వదిలేసింది. ‘ఈ ఒప్పందం ఫ్రెంచ్ ప్రయోజనకారి. మేక్ ఇన్ ఇండియాను మోడీ ఎందుకు వదిలేశారో! ‘లండన్’ స్ట్రాటెజిక్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్’ సంస్థ విశ్లేషకులు దేవ్ మెహతా వ్యాఖ్యానించారు.

రాఫెల్ ఇరు ప్రభుత్వాల ఒప్పందం. ప్రైవేట్లకు తావేలేదన్నారు మోడీ. మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన తొలి కార్పొరేట్ అనిల్. అందుకే అనుభవంలేని రూ.45 వేల కోట్ల అప్పున్న అనిల్ గర్భస్త సంస్థకు 30 వేల కోట్లు లాభం చేకూర్చారు. 10.04.15న అనిల్ సమక్షంలో పారిస్‌లో కొత్త ఒప్పందం జరిగింది. 24.04.15న అనిల్ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ స్థాపించారు. 28.08.15న నాగపూర్ ప్రత్యేక ఆర్థిక మండలి మిహాన్‌లో 104 ఎకరాల స్థలం రూ.63 కోట్లకే కేటాయించారు. అనిల్ రెండేళ్ళ తర్వాత్ ఆ డబ్బు చెల్లించారు. 22.02.16న రాఫెల్ కాంట్రాక్ట్ కట్టబెట్టే నాటికి అనిల్ సంస్థకు భూమి, భవనాలు లేవు. రక్షణ రంగంలో ప్రైవేటు కంపెనీ దేశభద్రతకు ముప్పు. 78 ఏళ్ళ అనుభవమున్న హెచ్.ఎ. ఎల్. ను కాదని ఉనికిలోనే లేని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్‌కు ఇచ్చారు. ఒప్పందం జరగాలంటే అనిల్ కంపెనీ ఎంపిక తప్పనిసరని భారత ప్రభుత్వం చెప్పిందని 11.05.17న కార్మిక సంఘాల అధికార సమావేశంలో దసో అధికారి లోయిక్ సెగలెన్ చెప్పారు.

పరిహార (ఆఫ్సెట్) లక్ష్యాలను పట్టించుకోలేదు. 30% ఆఫ్సెట్ తో 36 జెట్ల మీదే రూ.18 వేల కోట్లు పొందే అవకాశం దసోకిచ్చారు. అనిల్ వాటా రూ. 30 వేల కోట్లు. 03.10.16న దసో, రిలయన్స్ 50% ఆఫ్సెట్ ఆమోదించాయి. అనిల్ లాభం 20% పెరిగింది. ఆఫ్సెట్ లాభం ప్రభుత్వ సంస్థే పొందాలి. హెచ్.ఎ.ఎల్.ను ప్రయోజన పరిధి నుంచి తప్పించారు. మన లాంచింగ్ వాహనాలు రాఫెల్ జెట్లకు అనుకూలం కావు. దసో నుండి కొత్త లాంచింగ్ వాహనాలు కొనాలి. ఈ ఒప్పందం మనకు ఉద్యోగాలు ఇవ్వదు. కొత్త సాంకేతికతలను నేర్పదు.

ప్రభుత్వ నిర్ణయ జ్ఞానాన్ని ప్రశ్నించలేము. శత్రువులు 4, 5వ తరం జెట్లను సేకరిస్తుంటే మనం సంసిద్ధ రహితంగా, అర్ధ తయారీలో ఉండలేము. రాఫెల్ ఒప్పంద సిఎజి నివేదికను పార్లమెంటరీ ప్రజాపద్దుల సమితి (పిఎసి) పరీక్షించింది. ధరల ప్రకటన దేశ భద్రతకు ముప్పు. ఒప్పంద నిబంధనల ఉల్లంఘన. ఒప్పందంలో వాణిజ్య పక్షపాతం లేదు అని ప్రజా వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాని నిజాలు వేరే. జెట్ల సంఖ్య 126 నుండి 36కు తగ్గితే సంసిద్ధ సామర్థ్యాలు తగ్గుతాయి. ధర తక్కువైతే 26 జెట్లే కొన్నారెందుకు? శత్రుదేశాల 5వ తరం జెట్ల కొనుగోలు అబద్ధ్దం. తయారే కాని సిఎజి నివేదికను పిఎసి కిచ్చామని ప్రభుత్వం అబద్ధమాడింది.

సిఎజి నివేదికను నేరుగా కోర్టు కివ్వటం రాజ్యాంగ నేరం. రక్షణ సేకరణ విధానం- 2013 (డిపిపి) ఆదేశిక సూత్రాలను ఏప్రిల్ 2015లో అనుసరించామని కోర్టుకు తెలిపారు. డిపిపి- 2013లో ఆదేశిక సూత్రాలే లేవు. 2016లో ప్రభుత్వం తనకు అనుకూలంగా చేర్చింది. అనిల్‌కు అవకాశ మిచ్చేటట్లు ఆఫ్సెట్ 8వ నిబంధననూ చేర్చింది. దేశ రక్షణ ఒప్పంద వాణిజ్య ధరలు తెలుసుకునే హక్కు ప్రజలకుంది. ప్రధాని ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయించవచ్చనే అభిప్రాయాన్ని, ఆర్థికాంశాలు తెలపకుండానే ప్రభుత్వాలు విదేశాలతో రహ స్య ఒప్పందాలు చేసుకునే వెసులుబాటును ఈ తీర్పు కల్పించింది. 25.03.15కి 95% ఒప్పందం పూర్తయింది. హెచ్.ఎ.ఎల్.తో సౌకర్యంగా, సంతృప్తికరంగా ఉందని దసో ప్రకటించింది. ఒప్పందం ఉండగా రక్షణ మంత్రికి చెప్పకుండా 10.04.15 న 36 జెట్ల కొనుగోలు నిర్ణయం ప్రకటించారు మోడీ. నిరంకుశత్వం, కార్పొరేట్ పక్షపాతం, గోప్యతల్లో నిష్ణాతుడు మోడీ. కోర్టుకిచ్చిన సీల్డు కవర్లో కుట్రపన్నారు. నిజాలు దాచారు. అబద్ధాలు చేర్చారు. కోర్టును తప్పుదారి పట్టించారు. ప్రజలను ఎగతాళి చేశారు. కుంభకోణానికి, భారీ ప్రజాధననష్టానికి కారణమయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News