Monday, April 29, 2024

కార్పొరేట్లపైనే కనికరం

- Advertisement -
- Advertisement -

మోడీ సర్కార్ నిర్వాకం.. సామాన్యులపై పెనుభారం

పరిహాసంగా మారిన పన్ను విధానం దేశ పన్ను ఆదాయంలో తగ్గుతున్న కార్పొరేట్
వాటా నుంచి 26 శాతానికి తగ్గుముఖం ఈ ఒక్క ఏడాదే 2.5లక్షల కోట్ల
తగ్గుదల మరోవైపు వేతన జీవుల వాటా పెరుగుతున్న వైనం

మన తెలంగాణ/హైదరాబాద్: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పన్ను విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా, వేతన జీవుల నడ్డివిరిచేలా ఉన్నాయి. 2022 మార్చి 31 ముగింపు నాటికి దేశీ య ఆదాయం పన్ను వసూళ్లు రూ. 27.57 లక్షల కోట్లు వచ్చాయి. అయితే దీనిలో కార్పొరేట్ల పన్ను రూ.7.2 లక్షల కోట్లు నమోదైంది. అంటే ఇది మొత్తం పన్ను ఆదాయంలో 26 శాతం వాటాను కల్గిఉంది. అయితే తొమ్మిదేళ్ల క్రితం అం టే 2014లో వచ్చిన ఆదాయంతో పోలి స్తే కార్పొరేట్ల పన్ను ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

2014 సంవత్సరంలో భారతదేశం మొత్తం ప న్ను ఆదాయం రూ.11.55 లక్షల కోట్లు ఉంది. దీనిలో కార్పొరేట్ల నుంచి వచ్చిన టాక్స్ వసూళ్లు రూ.3.93 లక్షల కోట్లు, అంటే మొత్తం పన్ను ఆదాయంలో ఇది 34 శాతం వాటాను కల్గివుంది. 2022 లో కార్పొరేట్  వాటా 26 శాతానికి తగ్గింది. అంటే కార్పొరేట్ ప న్ను వసూళ్లు 8% మేరకు తగ్గాయి. ఓవైపు కార్పొరేట్ల పన్ను ఆదాయం ఈ విధంగా తగ్గుతూ ఉం డ గా, మరోవైపు వేతనజీవుల వాటా మాత్రం పెరుగుతోంది. కార్పొరేట్ టాక్స్ తగ్గింపు వల్ల దేశ ఖజానా కు ఈ ఒక్క ఏడాదే రూ.2.5 లక్షల కోట్ల నష్టం వా టిల్లిందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కార్పొరేట్లకు 22 శాతం పన్ను

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ పన్నును తగ్గించి, మధ్య తరగతివారిని నిర్లక్షం చేస్తోంది. వేతనజీవులకు గరిష్ఠంగా 30 శాతం వరకు పన్ను విధిస్తుండగా, కార్పొరేట్లకు రాయితీలతో 22 శాతమే పన్ను విధిస్తోందని ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. కార్పొరేట్లకు ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో 30 శాతం నుంచి 22 శాతం వరకు తగ్గింపు అవకాశాలను ఇచ్చింది. 202223 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం, 15.85 శాతం కంపెనీలు 22 శాతం పన్ను (మినహాయింపులు/ రాయితీలు లేకుండా), 0.14 శాతం కంపెనీలకు 15 శాతం పన్ను (కొత్త ఉత్పత్తి యూనిట్లకు) నిర్ణయించారు. కార్పొరేట్లకు పన్నును 30 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గిస్తూ వచ్చారు.

కానీ వేతనం తీసుకునేవారికి, పేదలకు మాత్రం అన్ని విభాగాల్లోనూ పన్నుల్లో ఎలాంటి ఊరటనివ్వలేదు. గతంలో 2012 సంవత్సరంలో ఆదాయం పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేశారు. 2014 సంవత్సరంలో 80సి మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేతన జీవులకు ఎలాంటి ఊరట లేకపోగా, పన్నులను మరింత పెంచారు. ఎల్‌టిసిజి (దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను), పిఎఫ్ (ఉద్యోగ భవిష్య నిధి), ఆరోగ్యం, విద్య పన్ను, రూ.50 లక్షలకు పైన ఆదాయంపై సర్‌చార్జ్ వంటివి ఉన్నాయి. ఉపాధి, ఆర్ధిక వృద్ధి కోసం కార్పొరేట్లకు పన్ను రాయితీలు తప్పవు అని కేంద్రం సమర్దించుకుంటోంది. కానీ సామాన్యులపై పన్ను, సెస్ భారాలు కూడా కాస్త తగ్గిస్తే, మెజారిటీ ప్రజానీకానికి ఊరట కల్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే బడ్జెట్ 202324 కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News