Sunday, April 28, 2024

టైడ్‌లో చేరిన 50వేలకు పైగా భారతీయ ఎస్‌ఎంఈలు

- Advertisement -
- Advertisement -

యుకెలో సుప్రసిద్ధ ఎస్‌ఎంఈ లక్ష్యిత వ్యాపార ఆర్థిక సేవల వేదిక, టైడ్‌, డిసెంబర్‌ 2022లో భారతదేశపు మార్కెట్‌లో ప్రవేశించిన నాటి నుంచి 50వేలకు పైగా ఎస్‌ఎంఈలను తమ బోర్డ్‌పై చేర్చుకుంది. తమ భారతీయ మార్కెట్‌ వ్యూహం, కాంప్లియెన్స్‌ ఫస్ట్‌ విధానంతో, టైడ్‌ ఎస్‌ఎంఈలను చేర్చుకోవడంతో పాటుగా రూపే కార్డులను వీడియో కెవైసీ (నో యువర్‌ కస్టమర్‌ ) పూర్తి అయిన తరువాత మాత్రమే అందజేసింది. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ తప్పనిసరి చేసిన మార్గదర్శకాలకు లోబడి అధీకృతం కాని యూజర్లు ఈ ప్లాట్‌పామ్‌ను వినియోగించడాన్ని నిరోధించడంతో పాటుగా ఈ ప్లాట్‌ఫామ్‌పై లభించే ప్రయోజనాలను మోసపూరిత వ్యక్తులు పొందడాన్ని నిరోధిస్తుంది. ఈ ప్రక్రియ క్రమంగా అధికారిక ఆర్ధిక వ్యవస్ధలో ఎస్‌ఎంఈలను చేర్చడానికి మద్దతు అందిస్తుంది. దీనితో పాటుగా డిజిటల్‌ ఇండియా కార్యక్రమాల వ్యాప్తిని మరింతగా పెంచుతుంది మరియు వెనుకబడిన విభాగాలకు క్రెడిట్‌ యాక్సెస్‌ను పెంచుతుంది. టైడ్‌ ఇప్పటికే 50వేల ఫుల్‌ కెవైసీ రూపే కార్డులను తమ సభ్యులకు జారీ చేసింది.

వేగవంతంగా మార్కెట్‌ స్వీకరణ జరుగుతుండటంతో పాటుగా భారతదేశంలో మార్కెట్‌లో ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకుని తమ ప్లాట్‌ఫామ్‌పై 10 లక్షల మంది ఎస్‌ఎంఈలు చేరతారని టైడ్‌ ఆశిస్తుంది. ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మార్చి నాటికి 2.25 లక్షల యాప్‌ డౌన్‌లోడ్స్‌ను టైడ్‌ గుగూల్‌ ప్లే పై చూసింది. ఈ కంపెనీకి ప్రస్తుతం భారతదేశంలో సభ్యులుగా జెన్‌ జెడ్‌, మిల్లీనియల్స్‌ ఉన్నారు. వీరిలోనూ 90% మంది సభ్యుల వయసు 40 సంవత్సరాలలో ఉంది.

టైడ్‌ యొక్క వ్యాపార బ్యాకింగ్‌ సేవలను తొలుత స్వీకరించిన రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, రాజస్తాన్‌ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ను అధికంగా చిన్న మామ్‌ అండ్‌ పాప్‌ షాప్స్‌, చిన్న రెస్టారెంట్లు,సోలోప్రిన్యూర్స్‌అయిన నటులు, బేకర్స్‌, బ్యూటీషియన్లు, డాక్టర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు, టీచర్లు, బిజినెస్‌ కోచ్‌లు, భీమా బ్రోకర్లు, ఎక్కౌటింగ్‌ మరియు ట్యాక్స్‌ ప్రొఫెషనల్స్‌ స్వీకరిస్తున్నారు.

టైడ్‌ (ఇండియా) సీఈఓ గుర్జోద్‌పాయ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘ఓ ఆర్దిక వేదిక విజయం చురుకుగా ఉండటంతో పాటుగా అదే సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని టైడ్‌ విశ్వసిస్తోంది. 2024 సంవత్సరాంతానికి 10 లక్షల మంది ఎస్‌ఎంఈలను చేరుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ ప్రయాణంలో ఎక్కడా నిబంధనలను అతిక్రమించడమంటూ ఉండదు. పూర్తి కెవైసీ ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే అంటే ఫేసియల్‌ రికగ్పైజేషన్‌, ఆటోమేటెడ్‌ డాటా ఎక్స్‌ట్రాక్షన్‌, మెషీన్‌ లెర్నింగ్‌ పద్ధతులకు అనుగుణంగా ఇది ఉంటుంది. ఈ రియల్‌ టైమ్‌ అప్రోచ్‌ తో ఆర్‌బీఐ సూచించిన అన్ని మార్గదర్శకాలను మేము అనుసరిస్తున్నాము’’ అని అన్నారు.

టైడ్‌ ఇప్పుడు నూతన టూ వే కమ్యూనికేషన్‌ ప్రచారం ‘వియ్‌ ఆర్‌ లిజనింగ్‌’ను ప్రారంభించింది. ఇది తమ సభ్యులకు తమ అభిప్రాయాలు, ఆందోళనలు తెలిపే అవకాశం అందించడంతో పాటుగా అభిప్రాయాలను పంచుకోవడం, అదే సమయంలో బ్రాండ్‌ నిర్ణయాల పట్ల స్ఫూర్తిని పొందడం చేస్తుంది.

‘‘భారతదేశంలో టైడ్‌ కార్యకలాపాలు విస్తరిస్తున్న వేళ, మేము మా ఉత్పత్తి ఆఫరింగ్‌ను వ్యాపారవేత్తలకు విస్తరించడంతో పాటుగా తమ ఆర్ధిక అంశాలను సౌకర్యవంతంగా నిర్వహించగలరు. అది కేవలం మా సభ్యుల చురుకైన జోక్యంతో మాత్రమే జరుగుతుంది. టైడ్‌ యొక్క అత్యంత కీలకమైన విలువలలో ఒకటిగా మెంబర్‌ ఫస్ట్‌ నిలుస్తుంది. వియ్‌ ఆర్‌ లిజనింగ్‌ ప్రచారం ప్రస్తుత మరియు భవిష్యత్‌ టైడ్‌ సభ్యులు ముందుకొచ్చి యాప్‌ మెరుగుపరచడానికి సలహాలను కోరుతుంది’’ అని ఆయన అన్నారు

యుకెలో 9% ఎస్‌ఎంఈ మార్కెట్‌ వాటాతో, టైడ్‌ ఇప్పుడు భారతదేశంలో టియర్‌ 1, 2, టియర్‌ 3 మార్కెట్‌లలో విస్తరించాలనుకుంటుంది. రాబోయే రోజులలో ఈ ఫిన్‌టెక్‌ విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఈ కంపెనీ విడుదల చేయనుంది. వీటిలో బ్యాంకుల భాగస్వామ్యంతో సేవింగ్స్‌/ కరెంట్‌ ఖాతాలు, చెల్లింపుల కోసం క్యుఆర్‌ కోడ్‌, బ్యాంకు బదిలీ , జీఎస్‌టీ, పే బై లింక్‌, క్రెడిట్‌ సర్వీసెస్‌ వంటివి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News