Monday, April 29, 2024

రాజకీయ విరాళాలలో ఇక పారదర్శకత సాధ్యం: సీతారాం ఏచూరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి తమకు ఇచ్చిన గడువును పొడిగించాలని కోరుతూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌డిఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం స్వాగతించింది. ఎన్నికల నిధులలో పారదర్శకత తీసుకురావడఆనికి ఇది ప్రధాన అడుగని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. చట్టబద్ధమైన అవినీతిని అడ్డుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన లడుగని ఆయన తెలిపారు.

మార్చి 12(మంగళవారం) బిజినెస్ అవర్స్ ముగిసే లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందచేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ నిధుల సమీకరణ ముఖ్యంగా ఎన్నికల నిధుల సమీకరణలో పారదర్శకతను తీసుకురావడంలో ఈ తీర్పు పెద్ద ముందడుగు కాగలదని ఆయన చెప్పారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు ఈ తీర్పు దోహదపడగలదని ఆయన తెలిపారు. ఎన్నికలకు నిధులు అందచేయడం వెనుక క్విడ్ పో కో(ఇచ్చి పుచ్చుకోవడం)అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పులో అనుమానం వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల బాండ్ల వెనుక దాగి ఉన్న అసలు లావాదేవీలు ఇవేనని ఆయన వ్యాఖ్యానించారు. దీన్నే తాము రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడమని పిలుస్తామని సీతారాం చెప్పారు. ఇప్పుడు దానికి ముగింపు పలకడంతో పారదర్శకత మెరుగుపడుతుందని ఆశించవచ్చని ఆయన చెప్పారు. గడువు పెంచాలని కోరిన ఎస్‌బిఐపి కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ సిపిఎం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా గడువును ఎస్‌బిఐ పాటించని పక్షంలో తమ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సుప్రీం తీర్పు ప్రతిపక్ష ఇండియా కూటమిపై మంచి ప్రభావం చూపగలదని ఆయన స్పష్ఠం చేశారు. తమకు ఇష్టులైన కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి బేరసారాలకు పాల్పడుతూ, ప్రజల ప్రజాస్వామిక తీర్పును కాలరాయడానికి ఎన్నికల బాండ్ల ద్వారా చట్టబద్ధంగా సంపాదించిన డబ్బును వారు(బిజెపి) ఖర్చు చేస్తున్నారని, ఇక ఆ అక్రమ లావాదేవీలకు అడ్డుకట్టపడిందని సీతారాం వ్యాఖ్యానించారు. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని, ఇదంతా అటువంటి నిధుల సమీపకఱతోనేనని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News