Monday, April 29, 2024

ఎస్టీలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలు అధికంగా అక్కడే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్టీలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలు అధికంగా కొత్తగూడెంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ శాఖ షురూ చేసింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా ఆగస్టు 21వ తేదీన లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తు దారులు స్వయంగా ఆధార్ కార్డ్, పాన్‌కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకు రావాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతుంది.

ఎస్టీలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలు అధికంగా కొత్తగూడెంలోనే….
షెడ్యూలు ప్రాంతాల్లో ఎస్టీలకు ఇదివరకే రిజర్వు చేసిన 95 మద్యం దుకాణాల్లో దాదాపు సగం వరకు కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నాయి. ఆ జిల్లాలో 44 దుకాణాలను ఎస్టీలకు కేటాయించారు. భూపాలపల్లి, మహబూబాబాద్‌లో 11 చొప్పున, ఆదిలాబాద్లో 9, మంచిర్యాల, ఖమ్మంలలో 6 చొప్పున, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 4 షాపుల చొప్పున రిజర్వ్ చేశారు.

దుకాణాల రిజర్వేషన్ వివరాలు
మొత్తం మద్యం దుకాణాలు- 2620 కాగా, ఓపెన్ కేటగిరీ షాపులు- 1834 పోనూ మొత్తం రిజర్వుడ్ షాపులను 786 కేటాయించారు. వాటిలో గౌడలకు- 393 (15 శాతం), ఎస్సీలు- 262 (10 శాతం), షెడ్యూల్ ఏరియా ఎస్టీలకు- 95, నాన్ షెడ్యూల్ ఎస్టీలకు- 36, ఎస్టీలకు మొత్తం- 131 (5 శాతం) చొప్పున కేటాయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News