Monday, April 29, 2024

నిలచిన రాకపోకలు అవస్థలో వాహనదారులు

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాలలో జరుగుతున్న బ్రిడ్జీ నిర్మాణ పనులలో త్రీవ జ్యాప్యంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులులగా బ్రిడ్జీ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసి రవాణ సౌకర్యం కల్పించారు. రెండు రోజుల క్రితం భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరదతో తాత్కాలికంగా వేసిన రోడ్డు పూర్తిగా కోట్టుక పోయింది.

దీంతో ఎల్లారెడ్డిపల్లి, గుండారం, సిద్దాపూర్, నడిమితాండ, ఎల్లాపూర్ తాండ, గ్రామాల ప్రజలకు మరియు మెదక్ వెళ్ళే వాహనదారులకు, ప్రయాణికులకు రాకపోకలు నిలచి పోయాయి. ఆర్టీసి బస్సులు సైతం కొండాపూర్ వరకు మాత్రమే నడిపారు. కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా తాత్కాలికంగా రోడ్డు వేయడంలో సదరు కాంట్రాక్టర్ నిర్లక్షం కారణంగా గ్రామాల ప్రజలు ఇటు కామారెడ్డికి, అటు మెదక్ వెళ్ళేందుకు రవాణా నిలచి పోవడంతో త్రీవ ఇబ్బందులు పడుతూ సదరు కాంట్రాక్టర్ తీరుపై అగ్రహాం వ్యక్తం చేశారు.

ఎండకాలం, చలికాలంలో పనులు చేపడితే బాగుండేదని పలువూరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పనులు వేగవంతంగా చేసి రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని అయ గ్రామాల ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. రాకపోకలు స్థంబించడంతో మెదక్‌వైపు వెళ్ళేవారు కామారెడ్డి నుండి రామయంపేట్ మీదుగా, లింగంపేట్ నుండి పోల్కంపేట్ మీదుగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనాలు వెళ్ళేందుకు తాత్కాలిక రోడ్డు వేయడంతో కాస్త ఇబ్బంది తొలగింది. ఆర్టీసి బస్సులు మెదక్, గుండారం వైపు నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News