Monday, April 29, 2024

ఎంపిఒసి యూత్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్

- Advertisement -
- Advertisement -

మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ (MPOC) విజయవంతంగా తమ యూత్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ ముగింపు వేడుకను గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో జరుపుకుంది. ఈ కార్యక్రమం లో పామాయిల్ యొక్క అసాధారణమైన వైవిధ్యత, ఆరోగ్య ప్రయోజనాలను తెలపటంతో పాటుగా వంటల సృష్టిలో అతి ముఖ్యమైన పదార్ధంగా దీని ప్రాముఖ్యతను ప్రధానంగా వెల్లడించింది. అనుభవజ్ఞులైన నిపుణులతో వర్ధమాన పాకశాస్త్ర ప్రతిభను ఏకం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం అశేషమైన ప్రశంసలను పొందింది.

” అమెచ్యూర్ “, “ఎక్సపర్ట్స్” విభాగాలుగా విభజించబడిన ఈ పోటీలో ప్రతి గ్రూప్ లో 40 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. “అమెచ్యూర్” వర్గం ను మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం రూపొందించబడింది, పాల్గొనేవారికి ఒకే స్టార్టర్‌ను రూపొందించడం ద్వారా తమ పాక శాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించడానికి తగిన అవకాశం కల్పిస్తూ 1 గంట, 30 నిమిషాల సమయం అందించబడింది. ఈ విభాగం యువ ప్రతిభావంతులకు వారి సృజనాత్మకత, వంట పట్ల అభిరుచిని వ్యక్తీకరించడానికి తగిన వేదికను అందించింది, తమ పాక శాస్త్ర ప్రయాణానికి వేదికగానూ నిలిచింది.

” ఎక్సపర్ట్స్” విభాగంలో, 3వ, 4వ సంవత్సరాల విద్యార్థులు వున్నారు. ప్రత్యేకంగా వీరి కోసమే ఈ విభాగం రూపొందించబడినది. ఈ విభాగానికి 2 గంటల 30 నిమిషాల పాటు సమయం అందించి తమ పాక శాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం అందించారు. ఈ డిమాండ్ ఉన్న వర్గం విద్యార్థులకు శాఖాహారపు స్టార్టర్, మాంసాహార ప్రధాన వంటకం, అనుబంధాన్ని సృష్టించే బాధ్యతను అప్పగించింది. తమ పాక శాస్త్రానికి కళాత్మకతను జోడిస్తూ పామాయిల్‌తో సామరస్యపూర్వకమైన, సమతుల్యమైన భోజనాన్ని క్యూరేట్ చేయగల వారి సామర్థ్యాన్ని ఈ సవాలు హైలైట్ చేసింది.

ఈ పోటీ అంతటా, పామాయిల్, దాని విలక్షణమైన రుచి, పోషక ప్రయోజనాల పరంగా ప్రత్యేకంగా నిలిచింది. తయారుచేయబడిన అన్ని వంటలలో స్టార్ ఇంగ్రిడియెంట్‌గా ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. ప్రదర్శించబడిన పాక శాస్త్ర నైపుణ్యానికి మించి, పామాయిల్ యొక్క స్థిరమైన ఉత్పత్తి, ఆరోగ్య ప్రయోజనాల గురించి పాల్గొనేవారికి, హాజరైన వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల తమ ఆనందం వ్యక్తం చేసిన గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ…”ఈ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ ఖచ్చితంగా మలేషియా పామ్ ఆయిల్, దాని ప్రయోజనాలను బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడింది. పామ్ఆయిల్ లో ఆహారాన్ని ఎంత బాగా వండవచ్చు అనేది తెలిసింది. ఈ మాస్టర్ చెఫ్ పోటీ మొదటిసారిగా పామాయిల్‌ను ఉపయోగిస్తున్న విద్యార్థుల విజ్ఞానం మరియు నైపుణ్యాలను ప్రదర్శించింది. మా విద్యార్థులకు ఇది గొప్ప అభ్యాస అనుభవం. మరోసారి భావన జీ, మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ కు ధన్యవాదాలు” అని అన్నారు .

యూత్ ఔట్రీచ్ ప్రోగ్రామ్, ఒక పోటీ కంటే ఎక్కువగా, యువ పాకశాస్త్ర ఔత్సాహికులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పరిశ్రమ నిపుణుల నుండి నేర్చుకోవడానికి, కలినరీ ప్రపంచంలో పామాయిల్ యొక్క విభిన్న అప్లికేషన్స్ తెలుసుకోవటానికి ఒక అమూల్యమైన వేదికను అందించింది. ఇది ఔత్సాహిక చెఫ్‌లకు ఒక మెట్టుగా పనిచేసింది, ఆహారం, ఆతిథ్య పరిశ్రమలో మంచి కెరీర్‌లకు మార్గం సుగమం చేసింది.

ఈ కార్యక్రమంలో ఇద్దరు విశిష్ట వక్తలు, డాక్టర్ పుబాలి ధర్, డాక్టర్ రంజనా దాస్ పాల్గొనటంతో పాటుగా పామాయిల్ ప్రయోజనాలపై అమూల్యమైన సమాచారం అందించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారి మార్గదర్శకత్వం, నైపుణ్యం పోటీ సమయంలో విద్యార్థులకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది, కలినరీ ప్రయత్నాలలో పామాయిల్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.

ఈ కార్యక్రమం నెట్‌వర్కింగ్, నేర్చుకోవడం, కలినరీ నైపుణ్యాలను ప్రదర్శించడం కోసం అవకాశాలను అందిస్తూ, పోటీలో పాల్గొన్న వారందరికీ సంతోషకరమైన, ఆకర్షణీయమైన అనుభవంగా నిరూపించబడింది. ఈ ప్రతిభావంతులైన యువ చెఫ్‌లు పాకశాస్త్ర శ్రేష్ఠత కోసం పోటీ పడుతున్నప్పుడు వారితో చేరి మద్దతు ఇచ్చిన ఆహార ప్రియులు, పరిశ్రమ నిపుణులు, ప్రజలకు MPOC హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

మలేషియా పామ్ ఆయిల్ కౌన్సిల్‌కు చెందిన భావనా షా, గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో యువతతో విలువైన జ్ఞానాన్ని పంచుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశారు. ఆమె ప్రసంగ సమయంలో, ఆమె పామాయిల్ యొక్క విలక్షణమైన లక్షణాలను వెల్లడించారు. వివిధ వంటకాలలో దాని విశేషమైన బహుముఖ ప్రజ్ఞ, వంట కోసం దాని అధిక స్మోక్ పాయింట్, దాని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల కూర్పును వినియోగదారులకు పోషకమైన ఎంపికగా చేస్తుంది. అదనంగా, ఆమె పామాయిల్ పరిశ్రమలో సుస్థిరత కార్యక్రమాలను హైలైట్ చేశారు, పర్యావరణ బాధ్యత పట్ల తమ నిబద్ధతను నొక్కి చెప్పారు. మలేషియా పామ్ ఆయిల్ యొక్క 100 సంవత్సరాల చరిత్రను, దాని ప్రపంచ ప్రయోజనాలను ఆమె నొక్కిచెప్పారు. మాస్టర్‌చెఫ్ టైటిల్ పట్ల విద్యార్థులు చూపిన ఉత్సాహం, ఈ విలువైన పంట గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఆమె ప్రశంసించారు. ఆమె వారి నిరంతర ప్రయత్నాలను, ఎదుగుదలను ప్రోత్సహించారు.

మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ యువ కలినరీ ప్రతిభను పెంపొందించడంలో, పామాయిల్ యొక్క అనేక ప్రయోజనాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసలకు అర్హమైనది. గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లోని యూత్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ కలినరీ నైపుణ్యం, సుస్థిరత, తరతరాలుగా పాక శాస్త్ర సంప్రదాయాలలో వైవిధ్యమైన, పోషకమైన పదార్ధాన్ని ప్రోత్సహించడంలో కౌన్సిల్ యొక్క నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News