Monday, April 29, 2024

ముంబై ఇండియన్స్ అదరహో..

- Advertisement -
- Advertisement -

Mumbai Indians are best team in history of IPL

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టుగా నిలిచింది. ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డులను ముంబై సొంతం చేసుకుంది. తాజాగా యూఎఇ వేదికగా జరిగిన 13 ఐపిఎల్‌లో కూడా ట్రోఫీని సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో ఐదు ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించడం ద్వారా ముంబై ఐపిఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఒకప్పుడూ అంతంత మాత్రంగానే రాణించిన ముంబై కొన్నేళ్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై జట్టు రూపు రేఖలే మారిపోయాయి. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఐపిఎల్‌లో ఆధిపత్యం చెలాయించేవి. అయితే రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐపిఎల్‌లో ముంబై ఎదురులేని శక్తిగా తయారైంది. ప్రతి టోర్నమెంట్‌లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకొంటోంది. మెరుపులు మెరిపించే బ్యాట్స్‌మెన్, హడలెత్తించే బౌలర్లు, విధ్వంసక ఆల్‌రౌండర్లతో ముంబై చాలా బలంగా మారింది. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ముంబై జట్టులో ఉన్నారు.

అంతేగాక తాజాగా ఈ సీజన్‌లో ట్రెంట్ బౌల్ట్ రూపంలో మరో పదునైన అస్త్రం ముంబైకి లభించింది. బౌల్ట్ అసాధారణ బౌలింగ్‌తో ముంబైకి ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక హార్దిక్, పొలార్డ్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో పలు మ్యాచుల్లో ముంబైకి అండగా నిలిచారు. బౌలింగ్‌లో బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్ అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఓపెనర్ క్వింటన్ డికాక్, కెప్టెన్ రోహిత్ శర్మలు అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. సూర్యకుమార్, డికాక్, కిషన్ పలు మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టారు. ఫైనల్లో కూడా ఇషాన్ కిషన్ నిలకడగా రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక సూర్యకుమార్ బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. ఒత్తిడిలోనూ నిలకడగా రాణించి సత్తా చాటాడు.

డికాక్ కూడా పలు మ్యాచుల్లో జట్టుకు మెరుపు ఆరంభం అందించాడు. అంతేగాక వరుస హాఫ్ సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టించాడు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్ తమదైన ముద్ర వేశారు. ఇటు బుమ్రా, అటు బౌల్ట్ పోటీ పడి వికెట్లు తీశారు. దీంతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌లకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రోహిత్ సారధ్య ప్రతిభ కూడా తోడు కావడంతో ముంబై ఇండియన్స్ మరోసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడింది. రానున్న సీజన్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.

సమష్టి విజయమిది

ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్రోఫీని మరోసారి అందుకోవడం గర్వంగా ఉంది. సమష్టి పోరా టం వల్లే ఈ ట్రోఫీ దక్కింది. జట్టును చాంపి యన్‌గా నిలుపడంలో అందరి పాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించ డం వల్లే జట్టు విజేతగా నిలువగలిగింది. ఇక బౌల్ట్, బుమ్రా బౌలింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. ఈసారి ఇద్దరు అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. బ్యాటింగ్‌లో సూర్యకుమా ర్, ఇషాన్ కిషన్, డికాక్, పొలార్డ్, హార్దిక్‌లు అద్భుతంగా రాణించారు. ఇలా ప్రతి ఆటగా డు తనవంతు పాత్ర పోషించడంతో ముంబై ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. క్రికెట్ లో కొనసాగేంత వరకు ముంబై ఇండియన్స్‌కే ఆడతానని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావేలేదు.
                                                                                            – రోహిత్ శర్మ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News