Monday, April 29, 2024

టిఆర్‌పి కుంభకోణం!

- Advertisement -
- Advertisement -

టిఆర్‌పి కుంభకోణం!
రిపబ్లిక్ సహా మూడు ఛానళ్లపై దర్యాప్తు.. ముంబై పోలీసుల అదుపులో ఇద్దరు
తిప్పికొట్టిన రిపబ్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి
పరువునష్టం దావా వేస్తామని ప్రకటన

Mumbai Police Probe on TV Channels over TRP Fraud

ముంబై: నకిలీ టిఆర్‌పి రేటింగ్స్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న జాతీయ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టివి సహా మహారాష్ట్రకు చెందిన మరో రెండు లోకల్ మరాఠీ ఛానళ్ల గుట్టును ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు. విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్‌లో రిపబ్లిక్ సహా మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు. బార్క్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్ టిఆర్‌పి రేటింగ్ వివరాలు తెలిశాయని తెలిపారు. దీనిలో బార్క్ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే ఛానల్ మాత్రమే చూస్తామన్నవారికి ఉచితంగా టివితో పాటు కొంత నగదును సైతం అందిస్తారని పేర్కొన్నారు. కొంతమందికి లంచాలు ఇచ్చి మరీ తమ ఛానళ్లను చూసేలా చేస్తున్నారని అన్నారు. డేటా పరిశీలించిన తర్వాత తమకు కొన్ని విషయాలు తెలిశాయని, టివి చూస్తున్న కొన్ని ఇళ్లకు చెందిన వారికి హిందీ, మరాఠీ తప్ప ఇంగ్లీషు ముక్క కూడా రాదని, అలాంటి వారి ఇళ్లలో 24గంటలు అదే ఛానల్ సిచ్ ఆన్ చేసి ఉంటుందని వివరింరు. వారికి నెలకు తమ ఛానల్ ఆన్‌లో పెట్టినందుకు రూ.400 నుంచి 500 చెల్లిస్తున్నారని అన్నారు. హన్సాకు చెంది మాజీ ఉద్యోగుల ద్వారా అందిన సమాచారం మేరకు జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూశాయని అన్నారు. తద్వారా తప్పుడు టిఆర్‌పి రేటింగ్‌లు సృష్టించి ప్రకటనల ద్వారా నిధులు రాబట్టుకుంటున్నారని పరమ్‌వీర్ సింగ్ వివరించారు. ఆయా ఛానళ్లు, ప్రకటన దారుల ఖాతాలను కూడా పరిశీలిస్తునానమని, వాటి ఆధారంగా తుదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. తప్పుడు టిఆర్‌పిఎలతో ప్రకటనల ద్వారా అక్రమంగా సంపాదించాలని చూస్తున్నారని అన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టివి యజమానులను అరెస్ట్ చేశామని పరమ్‌బీర్ సింగ్ వివరించారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఈ స్కాంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని, విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మరికొన్ని చోట్ల రేటింగ్ స్కాం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని, వాటిపై కూడా దృష్టి సారిస్తామని అన్నారు.
సుశాంత్ కేసులో ప్రశ్నించినందుకే : ఆర్నబ్
ముంబై పోలీసుల ప్రకటనను రిపబ్లిక్ టివి యాజమాన్యం ఖండించింది. సుశాంత్ కేసులో పోలీసు అధికారి పరమ్‌వీర్ సింగ్‌ను ప్రశ్నించినందుకు తమ ఛానల్‌పై కక్ష గట్టారని రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి ఆరోపించారు. నిజాని నిర్భయంగా ప్రజలకు చెబుతున్నందుకే తమపై కక్షగట్టారనిఆ మండిపడ్డారు. పరమ్‌వీర్‌పై పరువురు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. సుశాంత్ కేసు, పాల్ఘర్ ఘటనలపై రిపబ్లిక్ టివి గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి బెదిరేది లేదని ఆర్నబ్ స్పష్టం చేశారు. బార్క్ తన ఫిర్యాదులో రిపబ్లిక్ టివి పేరును పొందుపరచలేదని, ఇదంతా ముంబై పోలీసులు కుట్రేనని ఆయన అన్నారు.

Mumbai Police Probe on TV Channels over TRP Fraud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News