Wednesday, May 1, 2024

700 కంటే ఎక్కువకు అమ్మొద్దు

- Advertisement -
- Advertisement -

Mutton

 

 అధిక ధరలకు మాంసం అమ్మితే చర్యలు
మటన్‌లో కల్తీలకు పాల్పడిన 52 షాపులపై కేసులు నమోదు
సామాజిక దూరం పాటించని పలు సూపర్ మార్కెట్లు సీజ్

మనతెలంగాణ/హైదరాబాద్ :లాక్‌డౌన్ సమయంలో కొందరు మటన్ తో పాటుగా అందులో ఇతర మాంసం ఉత్పత్తులు కలపుతూ కల్తీలకు పాల్పడటంతో పాటు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించి 52 మటన్ షాపులపై కేసులు నమోదు చేశారు. ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కొంతమంది మటన్ ను అధిక ధరలకు అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కేజీ మటన్ ను 700 కంటే ఎక్కువ ధరకు అమ్మకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్న క్రమంలో వైరస్ ను తట్టుకునే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆహరం తీసుకోవాలన్న సూచనల మేరకు మాం సం విక్రయాలకు డిమాండ్ పెరిగింది.

దీంతో మాంస వ్యాపారులు కల్తీతో పాటు అధిక ధరలకు విక్రయించడంతో అధికారులు కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. లాక్‌డౌన్ సమయంలో మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉల్లంఘించిన సూపర్ మార్కెట్లతో పాటు స్టోర్ల ను శనివారం పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి సీజ్ చేశా రు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఒకేసారి ఎక్కువ మందిని లోపలికి పంపిస్తున్నారని వచ్చిన సమాచారంతో పోలీసు అధికారులు సూపర్ మార్కెట్లను సీజ్ చేశారు. చందానగర్ లోని విజేత సూపర్ మార్కెట్, మధురా నగర్‌లోని వాల్‌మార్ట్‌లను జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సీజ్ చేశారు. సూపర్ మార్కెట్‌లో ఒకేసారి గుంపులు గుంపులుగా లోపలకి పంపడం, ఒక్క దగ్గరే జన టం ఎక్కువగా ఉండటం వలన సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా అన్ని మూసుకున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు అనుగుణంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని షాపులను తెరుస్తున్నారు.నిత్యవసర వస్తువులను సరఫరా చేసే సూపర్ మార్కెట్లు తెరుస్తున్నారు. అయితే, తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని కేంద్రం నిబంధనలు పెట్టి న విషయం విదితమే. కానీ, చాలామంది నిబంధనలు పాటించకుండా సూపర్ మార్కెట్ కు గుం పులు గుంపులుగా వెళ్తున్నారు. ఇటీవల ఎల్‌బి నగర్ డిమార్ట్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

 

Mutton Adulteration in the city
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News