Saturday, April 27, 2024

స్ట‌న్నింగ్ లుక్‌లో నాగశౌర్య..

- Advertisement -
- Advertisement -

Naga Shourya New Movie Pre Look Poster released

హైదరాబాద్: ఈ ఏడాది ‘అశ్వ‌త్థామ’ చిత్రంతో ప్రేక్ష‌కులను అలరించిన యంగ్ హీరో‌ నాగ‌శౌర్య ప్ర‌స్తుతం తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో నాగశౌర్య తన బాడీని ఈ సినిమాకు కావాల్సిన విధంగా మల్చుకున్నాడు. కండలు తిరిగిన దేహం, సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోలను ఈ యంగ్ హీరో అప్పడప్పడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, నాగశౌర్య తన కొత్త సినిమాని సంతోష్ జాగర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ చిత్రయూనిట్ విడుద‌ల చేశారు. ఇందులో నాగశౌర్య భారీ కండ‌ల‌తో, పొడ‌వాటి జుట్టును ముడి వేసుకొని నిలబడి ఉన్న స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించి వావ్ అనిపిస్తున్నాడు. ఇక, జూలై 27న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు పోస్ట‌ర్ లో చిత్రయూనిట్ వెల్లడించింది.

నాగ‌శౌర్య 20వ చిత్రంగా రూపొందుతున్న మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ వెల్లడించనుంది.

Naga Shourya New Movie Pre Look Poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News