Thursday, May 16, 2024

అజ్ఞాత విరాళాలు రూ.11వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

రూ.11వేల కోట్ల భారీ అజ్ఞాత విరాళాలు అందుకుంటున్న జాతీయ పార్టీలు
ఎడిఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు అజ్ఞాత వ్యక్తుల నుంచి భారీగానే విరాళాలు దండుకుంటున్నాయి. 2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, వివిధ సంస్థ్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ(ఎం), సిపిఐ, ఎన్‌సిపి, బిఎస్‌పిలు ఇసి కి సమర్పించిన వివరాలను పరిశీలించాక ఈ నివేదికను రూపొందించింది.

రూ. 20.000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటి రిటర్న్‌లో పేర్కొంటాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్ ఫండ్, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చా ల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. ఇక 2018-19లో రూ.1612కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బిజెపి వెల్లడించింది. ఇదే ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో ఇలాంటివి ఇవి 64 శాతం కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్, ఎన్‌సిపిలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లుగా ఏడిఆర్ నివేదికలో పేర్కొంది.

National Parties got Massive Funds from Unknown Persons

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News