Monday, April 29, 2024

నన్ను క్షమించండి: నయనతార

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ నయనతార నటించిన 75వ సినిమా ‘అన్నపూరణి’ విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మతానికి సంబంధించిన సన్నివేశాలు ఉండడంతో ఓటిటి నుంచి తొలగించారు. దీనిపై నయనతార స్పందించారు. తాము ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను గాయపరచలేదని, అలా జరిగి ఉంటే క్షమించాలని నయనతార అడిగారు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేశానని తెలిపారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో పాజిటివ్‌ను ఎక్కువగా వ్యాప్తి చేసే సినిమాలు చేశానని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాను ఓటిటి వేదిక నుంచి తొలగిస్తారని తాను ఊహించలేదన్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకు ఈ సినిమాలో నటించానని ఆమె చెప్పారు. జై శ్రీరామ్ అంటూ లేఖ రాశారు. ఈ సినిమాలో మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఒటిటి నుంచి తొలగించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించని ఓ అమ్మాయి చెఫ్‌గా మారిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News