Wednesday, May 1, 2024

కేంద్రమంత్రి గడ్కరీని పొగడ్తల్లో ముంచెత్తిన ఎన్‌సిపి అధినేత పవార్..!!

- Advertisement -
- Advertisement -

NCP chief Pawar showers compliments on Union Minister Gadkari

పూణె: వైరిపక్షం నేతలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న అరుదైన ఘటన మహారాష్ట్రలో జరిగింది. శనివారం అహ్మద్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్, కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ ఒకే వేదికపై ప్రసంగించారు. ఆ సందర్భంగా గడ్కరీ పనితీరును పవార్ అభినందించారు. దేశాభివృద్ధికి పాటుపడే ప్రజాప్రతినిధులకు గడ్కరీ గొప్ప ఉదాహరణ అని పవార్ అన్నారు. అహ్మద్‌నగర్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని, ఆ కార్యక్రమానికి రావాలంటూ గడ్కరీ కోరడంతో వచ్చానని పవార్ తెలిపారు. శిలాఫలకాలు ఏర్పాటు చేయడంలాంటివి చాలా చూస్తాం.. కానీ, పనులు మాత్రం జరగవు. గడ్కరీ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల విషయంలో మాత్రం కొన్ని రోజులకే పనులు ప్రారంభమవుతాయని పవార్ అన్నారు. గడ్కరీ రవాణమంత్రి పదవి చేపట్టడానికి ముందు 5000 కిలోమీటర్ల హైవేలుండేవి. ఇప్పుడది 12,000 కిలీమీటర్లను దాటిందని పవార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News