Monday, April 29, 2024

దార్శనిక నేత

- Advertisement -
- Advertisement -

NDTV special article praising eight years of KCR rule

తెలంగాణ హృదయ వీణను సవరించి

హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని

దేశానికే తలమానికం చేసిన

ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్‌డిటివి ప్రత్యేక కథనం

అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు. రాష్ట్రం ఏర్పడినా పాలన చేతకాదు అన్న విమర్శలను పచ్చి అబద్ధాగా రుజువు చేస్తూ ఎనిమిది సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో రోల్ దేశానికే తలమానికంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిలిపారని గురువారం రాత్రి ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్‌డిటివి ప్రత్యేకంగా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అరగంటకు పైగా సాగిన ఈ కథనంలో కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం నుంచి అధికారం చేపట్టడం, పాలనలో అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిగా దృష్టిపెట్టి నడిపించడాన్ని, ఆయా రంగాల వారీగా సమగ్రంగా వివరించింది.

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై ఎన్‌డిటివిలో వీక్షించండి అంటూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో ప్రజలకు ఒక పోస్ట్ చేశారు. దీంతో స్టోరీ టెలికాస్ట్ సందర్భంగా లక్షలాది మంది రాష్ట్ర ప్రజలు ఆ టివినీ వీక్షించారు. దీంతో ఎన్‌డిటివి వ్యూస్ అమాంతంగా పెరిగింది. ఆ ఛానల్ ప్రసారం చేసిన వాటిల్లో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జోరుగా ఉద్యమాలు సాగుతున్న రోజులవి. టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో తెలంగాణ ప్రాంత ప్రజలంతా రోడ్లపైకి వచ్చి రాష్ట్రం కోసం ముమ్మరంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రం వస్తుందో.. రాదో అన్న అనుమానాలు చాలా బలంగా ఉండేవి. ఒకవేళ తెలంగాణ వచ్చినా రాష్ట్రం చీకటి మయంగా మారుతుంది. కరెంటు ఉండదు,ప్రజలకు తాగడానికి నీళ్లు ఉండవు, సాగు నీరు ఉండదు,తెలంగాణ ప్రాంతం మారుతుందన్న సమైక్యాంధ్ర పాలకుల హెచ్చరికలు జోరుగా వినిపించేవి. వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలను కెసిఆర్ చేశారు.

అందరి ఏకైక ఎజెండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే అన్న భావన కల్పించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని కెసిఆర్ సాధించగలిగారంటూ ఆ ఛానెల్ ప్రసారం చేసింది. ప్రస్తుతం సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అప్రతిహతంగా రంగాల్లో అగ్రస్థానంలో దూసుకపోతోందని పేర్కొన్నది. ప్రధానంగా రైతుబంధు, దళితబంధు, పేదలకు ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి పంటకు సాగునీటిని సిఎం కెసిఆర్ అందిస్తున్నారని ఎన్‌డిటివి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. కెసిఆర్ దార్శనికతతో కూడిన నాయకత్వంలో వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా అమలు చేస్తోందని వివరించింది.

విజనరీ లీడర్‌షిప్ –

సిఎం కెసిఆర్ ఒక విజనరీ లీడరని పేర్కొన్నది. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకపోతున్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత దేశం కంటే తెలంగాణ పలు అంశాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోందని వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ భౌగోళిక పరిమాణం, జనాభా పరంగా వరసగా 11, 12వ స్థానాల్లో ఉన్నప్పటికీ జిఎస్‌డిపిలో 4వ స్థానంలో కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 202120-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 14.7 శాతంగా ఉందని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ రాష్టం ఏర్పడగా గత ఆర్థ్ధిక సంవత్సరం నాటికే 130 శాతానికి పెరిగింది. ఇది అత్యద్భుతమైన వృద్ధి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయ రేటును 18.8 వద్ద నమోదు చేసి రూ.2,78,833కి చేరుకుంటుందని అంచనాలు వేసింది. ఇది 2014..20-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 125 శాతం పెరిగింది.

మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం

తెలంగాణ రాష్ట్ర చాలా బలమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉందని ఎన్‌డిటివి వెల్లడించింది. ఇది ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు కొనసాగించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసింది. ప్రధానంగా రాష్ట్రం మొత్తం విద్యుత్ సామర్థ్యం 16,613 మెగావాట్లలో ఉంది. ఇందులో 8,516 మెగావాట్లు (51శాతం) రాష్ట్ర ప్రభుత్వానిది కాగా, 2,645 మెగావాట్లు (16శాతం) కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. మరియు ప్రైవేట్ సంస్థల ద్వారా 5,453 (33 శాతం) మెగావాట్లుగా తెలియజేసింది. దీంతో దేశంలో 100 శాతం గృహ విద్యుద్దీకరణ ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఎన్‌డిటివి తన స్టారీ బోర్డులో వెల్లడించింది. 2019..20-20లో భారత రాష్ట్రాలలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధిని (9.2 శాతం) నమోదు చేసిందని పేర్కొన్నది. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,071 కెడబ్లూహెచ్ అని… ఇది అఖిల భారత సగటు 1,208 కెడబ్లూహెచ్ కంటే 71 శాతం ఎక్కువ అని తెలిపింది.

అలాగే 2018 నుండి వ్యవసాయ కనెక్షన్లకు ఇరవైనాలుగు గంటలు పాటు ప్రతి రోజు ఉచిత విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించింది. ఇక హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నగరంలో 158 కి.మీ పొడవు, 8-లేన్ ఎక్స్‌ప్రెస్ వే…. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్‌ఆర్)ను నిర్మించిందన్నారు. అలాగే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డిపి) కింద 12 ఫ్లైఓవర్‌లు, 5 అండర్‌పాస్‌లు, 9 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు, 9 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్‌ల నిర్మాణంతో పాటు మొత్తం 137 లింక్ రోడ్లను అభివృద్ధి చేసిందని వెల్లడించింది.

సమగ్రమైన రవాణ వ్యవస్థ

రాష్ట్రంలో సమగ్రమైన రవాణ వ్యవస్థను కలిగిందని తెలిపింది. రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటితో తెలంగాణ దూసుకపోతున్నదని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 1,07,871 కిమీ రోడ్ నెట్‌వర్క్ ఉందని…ఇందులో 67,276 కిమీ గ్రామీణ రోడ్లు కాగా, 3,910 కిమీ జాతీయ రహదారులుగా పేర్కొన్నది. ఇక 9,013 కిమీ జిహెచ్‌ఎంసి రోడ్లుకాగా, మిగిలిన 27,672 కిమీ రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులని వెల్లడించింది. 2020..20-21 నాటికి రాష్ట్రం మొత్తం 100 చదరపు కిమీకు 96 కిమీ రహదారి సాంద్రతను కలిగి ఉందని పేర్కొన్నది.దక్షిణ మధ్య రైల్వేలు (ఎస్‌సిఆర్) పరిధిలోకి వచ్చే తెలంగాణ మొత్తం మార్గం పొడవు 1,828 కి.మీ. రైలు నెట్‌వర్క్ తెలంగాణను ఉత్తర, తూర్పు, పశ్చిమతో పాటు దక్షిణ భారతదేశంతో కలుపుతుందని తెలియజేసింది. కాగారాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ 60 దేశీయ గమ్యస్థానాలకు, 12 అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానించబడి ఉందని స్టోరీ బోర్డులో ఆ ఛానెల్ పేర్కొన్నది. ఇది సంవత్సరానికి 1,50,000 ఎంటి నిర్వహణ సామర్థ్యంతో సమీకృత కార్గో సదుపాయాన్ని కూడా కలిగి ఉందని తెలిపింది. 2021 ఆర్ధిక ంసవత్సరంలో ఈ విమానాశ్రయం దాదాపు 2.2 కోట్ల విమాన ట్రాఫిక్‌ను చూసిందని పేర్కొన్నది.

అద్భుతమైన పర్యాటకం

పర్యాటక ప్రాంతాలకు నిధిగా తెలంగాణ కొనసాగుతోందని వెల్లడించింది. అనేక మత, ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా విస్తరించి ఉన్నాయని తెలిపింది. అయితే ఈ ప్రాంతం యొక్క అద్భుతమైన గతాన్ని అనేక చారిత్రాత్మక, పురావస్తు ప్రదేశాలలో చూడవచ్చునని వెల్లడించింది. పైగా రాష్ట్రంలో అనేక సహజ, వన్యప్రాణులు ఉన్నాయని తెలిపింది. అలాగే యాత్రికులు అన్వేషించడానికి అనేక సాహసోపేతమైన ప్రదేశాలను కూడా కలిగి ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామం ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‌చే ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ బిరుదు పొందిందని వెల్లడించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశ, బహుళార్ధసాధక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఎన్‌డిటివి తన స్టోరీ బోర్డులో వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీరుస్తోందని పేర్కొన్నది. వివిధ బ్యారేజీల మీదుగా 160టిఎంసి అడుగుల నిల్వ సామర్థ్యంతో, రిజర్వాయర్లు ప్రతిరోజు 2 టిఎంసి అడుగుల నీటిని ఎత్తిపోయడం ద్వారా 180 టిఎంసి ఫీట్లను వినియోగించుకుంటోందని పేర్కొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో రికార్డు స్థాయిలో పూర్తి చేశారని ప్రశంసించింది. వీటితో పాటు పాలమూరు,-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతా రామ ప్రాజెక్ట్ పనులను కూడా వేగవంతం చేసిందని వెల్లడించింది.

వ్యవసాయ విప్లవం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు అనుకూల కార్యక్రమాలు వ్యవసాయ రంగానికి అమితంగా ఊతమిచ్చాయని పేర్కొన్నది. ఖరీఫ్ సీజన్‌లో (2020-21) 141 లక్షల టన్నుల వరిని సేకరించిందని, ఇది దేశంలోనే రెండవ స్థానం కావడం విశేషమని వ్యాఖ్యానించింది. అలాగే రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి….భూమి ఉన్న ప్రతి రైతుకు రూ. ప్రతి సంవత్సరం ఎకరాకు రూ. 10,000లు పెట్టుబడి సాయంగా అందిస్తోందని వెల్లడించింది. అలాగే ఏదైనా కారణంతో రైతు మరణిస్తే ఆకు-టుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమాను కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలియజేసింది. కాగా రైతు బంధు 63 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూందని తెలియజేసింది.

నాలుగు విప్లవాలకు నాంది

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విప్లవాలకు నాందిపలికిందని పేర్కొన్నది. ఇందులో హరిత, శ్వేత, గులాబీ, నీలి విప్లవాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఐదో విప్లవాన్ని సాధించే దిశగా దూసుకుపోతోందని ప్రశంసించింది. కాగా హరిత విప్లవం ద్వారా వరి ఉత్పత్తి 2014..20-15లో 2.43 మిలియన్ టన్నుల నుండి 2020..20-21 నాటికి 14 మిలియన్ టన్నులకు పెంచిందని, శ్వేత విప్లవం ద్వారా పాల ఉత్పత్తి 4.2 మిలియన్ టన్నుల నుంచి 5.8 మిలియన్ టన్నులకు, గులాబీ విప్లవం ద్వారా గొర్రెల సంఖ్య 1.2 కోట్ల నుంచి 3.26 కోట్లకు, నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తిని 2.28 లక్షల టన్నుల నుంచి 3.49 లక్షల టన్నులకు పెంచిందని వెల్లడించింది. ఇక ఐదవ విప్లవంగా ఆయిల్‌పామ్‌దృష్టి సారిందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలియజేసింది.

దాహం తీరుస్తోంది!

మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన, స్థిరమైన పైపుల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తోందని పేర్కొన్నది. దాదాపు 54 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్‌ను అందించగా, ఔటర్ రింగ్‌రోడ్‌లోని ఇళ్ల కోసం ప్రత్యేకంగా అర్భన్ మిషన్ భగీరథను రూపొందించిందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఒక్కటి కూడా లేవని ప్రశంసించింది. ఈ పథకం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిందని, కేంద్రం కూడా ‘జల్ జీవన్ మిషన్’తో ముందుకు రావడానికి ప్రేరేపించిందని వ్యాఖ్యానించింది..

పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ

దేశ, విదేశాల్లోని పరిశ్రమలకు అనుకూలమైన, వినూత్నమైన రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతోందని స్టోరీబోర్డులో ఎన్‌డిటివి స్పష్టం చేసింది. ప్రధనంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్ ఐపాస్ ద్వారా కంపెనీలకు అవసరమైన అన్ని రకాల అనుమతులను కేవలం పదిహేను రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోందని తెలిపింది. ఈ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన వెల్లడించింది. అలాగే గత ఏడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఐటి రంగం కూడా గణనీయంగా పుంజుకుందని తెలిపింది. దీంతో ప్రపంచానికే హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్‌గా మారిందని ప్రశంసించింది. దీని కారణంగానే తెలంగాణకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్‌బుక్‌లు అమెరికా వెలుపల తమ రెండో అతిపెద్ద సౌకర్యాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశాయని తెలిపింది.

ప్రపంచ వ్యాక్సిన్లకు రాజధాని

800 ఫార్మా,బయోటెక్ కంపెనీలకు తెలంగాణ నిలయంగా మారిందని,. ప్రపంచ వ్యాక్సిన్ అవుట్‌పుట్‌లో 1/3వ వంతు హైదరాబాద్ రాజధాని నగరం నుంచే వస్తోందని వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ అనే పేరును సంపాదించుకుందని ఎన్‌డిటివి పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News