Monday, April 29, 2024

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం: వెయ్యి దాటిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Nearly 1000 died after strong earthquake in Afghanistan

కాబూల్: ఆఫ్గానిస్థాన్​లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవత్ర 6.1గా నమోదు అయిందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. పక్టికా ప్రావిన్స్​లో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. మరో 1500 మందికి తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పాకిస్థాన్ సరిహద్దులోని ఖోస్ట్ ప్రాంతానికి 47 కిలో మీటర్ల దూరంలో 51 కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉందని అధికారులు పేర్కొన్నారు. భూకంపం ధాటికి పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం ముమ్మరంగా సహాయచర్యలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News