Saturday, April 27, 2024

ఈ బంధం కలకాలం ఉంటుంది..

- Advertisement -
- Advertisement -

MODI

 

అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్‌అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం ఒక సంబంధం మాత్రమే కాదని, కలకాలం నిలిచి ఉండే గొప్ప బంధం అని ఆయన అన్నారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ట్రంప్‌కు కొత్తగా నిర్మించిన మోతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్ ’ కార్యక్రమంలో ఆయనకు సాంవగతం పలుకుతూ ట్రంప్ పర్యటన ఒక కొత్త చరిత్రను లిఖించబోతోందని , కొత్త బంధాలు, సవాళ్లు, అవకాశాలు, మార్పుల పునాదులు వేయనుందని అన్నారు.‘ భారత్‌అమెరికా సంబంధాలు, సహకారం 21వ శతాబ్దంలో ప్రపంచ గతిని నిర్ణయించడంలో ముఖ్య భూమికను పోషించనున్నాయి.

భారత్, అమెరికాలు సహజ భాగస్వాములని నేను బలంగా నమ్ముతున్నాను’ అని లక్షమందికి పైగా హాజరయిన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మోడీ అన్నారు. ‘ నమస్తే ట్రంప్‌జీ. నేను ఇండోయుఎస్ ఫ్రెండ్‌షిప్ అంటే మీరు లాంగ్‌లివ్ అనాలి. ఐదు నెలల క్రితం నేను అమెరికా యాత్రను హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ కార్యక్రమంతో మొదలు పెట్టాను. ఇప్పడు నా మిత్రుడు ట్రంప్ అహ్మదాబాద్‌లో ‘ నమస్తే ట్రంప్’ కార్యక్రమంతో మొదలు పెడుతున్నారు. ఆయన చాలా సుదూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. వెంటనే సబర్మతి ఆశ్రమానికి వెళ్లి ఇక్కడికి వచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోకి మీకు స్వాగతం. మీకు స్వాగతం పలికిన భూమి గుజరాత్‌ది అయినా.. ఉత్సాహం యావద్భారత దేశానిది. ట్రంప్, ఆయన భార్య, కుమార్తె ఇవాంక, అల్లుడు జర్డే ఇక్కడికి రావడం భారత్‌కు అమెరికాతో కుటుంబం వంటి సంబంధాలున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం పేరైన నమస్తేకు చాలా అర్థం ఉంది’ అని మోడీ అన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో చేస్తున్న కృషిని ప్రశంసించారు. పరస్పర విశ్వాసమే రెండు దేశాల ప్రజలు, దేశాల మధ్య ఉన్న బంధానికి అతిపెద్ద బలం అని ఆయన అన్నారు. ‘రెండు దేశాల మధ్య ఎన్నో పోలికలున్నాయి. భిన్నత్వంలో ఏకత్వమే భారత తత్వం. ఒక దేశం ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అయితే.. రెండోది ప్రపంచం మొత్తాన్ని కుటుంబం అనుకునేది. ఒక దానికి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ గర్వకారణం.. రెండో చోట ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమ లిబర్టీ ఆఫ్ యూనిటీ ఉంది. భారత ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌ను మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నా’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

ట్రంప్ ప్రసంగం ముగిసిన అనంతరం ధన్యవాదాలు తెలిపిన మోడీ ఈ స్నేహం చిరకాలం కొనసాగుతుందన్నారు. భారత్ పట్ల ట్రంప్ చూపిన ఆప్యాయత, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘భారత్ శక్తి సామర్థాల పట్ల మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ధన్యవాదాలు. మహాత్మా గాంధీ, పటేల్, వివేకానంద గురించి ప్రస్తావించడం గర్వకారణం. ఈ స్టేడియం గురించి మీరు అన్న ప్రతి మాట క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుంది. స్నేహానికి పునాది విశ్వాసం. ఈ స్నేహం చిరకాలం కొనసాగుతుంది. భారత్, అమెరికాల మైత్రి మరింత దృఢపడింది. ఇది కొత్త తీరాలకు చేరుతుంది. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచానికి కొత్త దశ, దిశను నిర్దేశిస్తున్నాయి’ అని అన్నారు.

ఆ రెండూ క్లాసిక్ సినిమాలు: ట్రంప్
అహ్మదాబాద్: తొలి సారి భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోతేరా స్టేడియంలో కిక్కిరిసిన జనాల మధ్య చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. బాలీవుడ్ సినిమాలను, క్రీడాకారులను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించడం ద్వారా ట్రంప్ భారతీయుల హృదయాలకు చేరువ కావడానికి యత్నించారు. ‘భారత్ క్రియేటివ్ హబ్.. బాలీవుడ్‌లో ఏడాదికి దాదాపు 2000 సినిమాలు నిర్మిస్తారు. భూగ్రహం మీద ఉన్న ప్రజలంతా బాలీవుడ్ సినిమాలను ఆస్వాదిస్తారు. భాంగ్రాను ఇష్టపడతారు. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, షోలే వంటి క్లాసిక్ సినిమాలను చూస్తారు. అంతేకాదు, సచిన్, కోహ్లీ లాంటి క్రికెట్ దిగ్గజాలు కూడా ఇక్కడినుంచే వచ్చారు’ అంటూ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు.

New chapter in IndianAmerican relations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News