Monday, April 29, 2024

న్యూజిలాండ్ జలసంధిని తొలిసారి దాటిన ఎలక్ట్రిక్ విమానం

- Advertisement -
- Advertisement -

electric plane cross straight
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని కుక్ జలసంధిని ఎలక్ట్రిక్ విమానంలో తొలిసారి దాటిన వ్యక్తిగా గ్యారీ ఫ్రీడ్‌మ్యాన్ సోమవారం చరిత్ర సృష్టించాడు. రెండు సీట్లున్న చిన్న సైజు సోలో విమానంలో ఆయన 40 నిమిషాలలో రెండు దక్షిణ పసిఫిక్ ప్రధాన ద్వీపాల మధ్య ఉన్న జలసంధిని అధిగమించాడు. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో వాతావరణ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ విమానంలో ఎగిరి అందరి దృష్టిని ఆకర్షించాలని ఆయన లక్షంగా పెట్టుకున్నాడు. ఎలక్ట్రిక్ విమానంలో ఓ సుదీర్ఘ జలాశయాన్ని దాటడం ఇదే మొదటిసారి అని వెల్లింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు భావిస్తున్నారు. భారీగా వాన కురుస్తున్నప్పటికీ, 15 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ ఫ్రీడ్‌మ్యాన్ బ్లెన్‌హీమ్ పట్టణం నుంచి టేకాఫ్ తీసుకుని ఈ రికార్డు సృష్టించాడు. ల్యాండింగ్ చేశాక ఆయన చాలా ఎక్సయిట్ అయ్యాడు. తానూహించిన దానికంటే టెక్నాలజీ బాగా పనిచేయడం అతడికి ఆనందాన్ని కలిగించింది. ‘‘ 40 శాతం బ్యాటరీ ఇంకా మిగిలి ఉండింది. దాంతో మేమే తిరిగి వెనక్కి తిరిగి వెళ్లగలిగి ఉండేవాళ్లం’’ అని ఫ్రీడ్ మ్యాన్ తెలిపాడు. 49 ఏళ్లున్న ఆయన ఎలక్ట్రిక్ ఎయిర్ కంపెనీని స్థాపించాడు. విద్యుత్, గ్యాస్ తో నడిచే విమానాన్ని నడపాలన్నది ఆయన అభిరుచి. 400 కిలోగ్రాముల(880 పౌండులు) బరువున్న విమానంలో ఫ్రీడ్ మ్యాన్ 78 కిమీ. ట్రిప్ సాధించాడు. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపాడు. విమానం విద్యుత్తును పరిరక్షించుకునేందుకు ఆయన గంటకు 130 కిమీ. స్లో వేగంతో ఆ విమానాన్ని నడిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News