Monday, April 29, 2024

న్యూస్‌క్లిక్ అరెస్టులపై వివరణ ఇచ్చుకోండి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పోలీసుకు హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి అరెస్టులపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్పందించింది. తమ అరెస్టులను సవాలు చేస్తూ వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఢిల్లీ సిటీ పోలీసులు సమాధానం ఇచ్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది.చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ( ఉపా) పరిధిలో తమ అరెస్టును వీరు సవాలు చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని తమ పిటిషన్ల విచారణ ముగిసే వరకూ తమను తాత్కాలికంగా విడుదల చేయాలని న్యూస్‌క్లిక్ నిర్వాహకులు కోరారు. దీనిపై నగర పోలీసు విభాగం తమ వివరణ ఇచ్చుకోవాలని న్యాయమూర్తి తుషార్ రావు గెడెలా పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన ఈ కేసును మొదటి కేసుగా న్యాయస్థానం విచారిస్తుంది. ఈ మేరకు విచారణల లిస్టులో పొందుపర్చారు. ఈ నెల 3వ తేదీన వీరి అరెస్టులు జరిగాయి. ఈ నెల 11 వరకూ వీరికి పోలీసు కస్టడీ విధించారు. ఇప్పటికే విచారణలో భాగంగా న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీల్ వేశారు. దేశంలో చైనా అనుకూల భావజాలాన్ని ప్రచారం చేసేందుకు న్యూస్‌క్లిక్‌కు నిధులు అందుతున్నాయనే అభియోగాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News