Sunday, May 12, 2024

హైదరాబాద్ లోని యువతకు డ్రగ్స్ వల..

- Advertisement -
- Advertisement -

Nigerian arrested due to Drugs Supply in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో యూత్‌ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను మంగళవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ వీసా మీద వచ్చిన డానియల్ అనే నైజీరియన్ ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు సిటీ యువతను టార్గెట్ చేసుకుని దందా చేస్తుండటంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వచ్చిన డానియల్ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Nigerian arrested due to Drugs Supply in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News