Monday, April 29, 2024

పాజిటివ్ కేసులు పెరిగితే రాత్రి కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

Night curfew if positive cases increase in Hyderabad

గ్రేటర్‌లో 100 దాటితే విధించే దిశగా వైద్యశాఖ ప్రతిపాదనలు
గత వారం రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతున్న కేసులు
జరిమానాలు విధించినా భౌతికదూరం పాటించని జనం
రద్దీగా మారిన మార్కెట్లు, వస్త్ర, బంగారం దుకాణాలు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరు గుతుండటంతో మహమ్మారి ఉనికి చాటే పరిస్థ్దితి ఉందని వైద్యశాఖ కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా పాటించడమే ఉత్తమమైన మార్గమని భావిస్తూ పాజిటివ్ కేసులు 100 దాటితే రాత్రిపూట కర్ఫ్యూ పెట్టేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలను ఒమిక్రాన్ వణికి స్తుండగా, తా జాగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ బారినపడి వ్యక్తి మృత్యువాత పడ్డారు. థర్డ్‌వేవ్ రూపంలో మరో సారి ప్రజల ప్రాణాలను హరిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి, సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో ముందుగా నైట్ కర్ఫ్యూ విధించి, తరువాత లాక్‌డౌన్ పెట్టారు. ప్రస్తుతం కూడా ఫిబ్రవరి వరకు వైరస్ తీవ్రతరం అయ్యే వాతావరణం కనిపిస్తుందని, దీనిని నివారణకు వైద్య చికిత్సల కంటే జాగ్రత్తలే ప్రాణాలు కాపాడుతాయని అంటున్నారు. రెండు మూడు రోజుల కితం జిల్లా వైద్యాధికారులు నైట్ కర్ఫూపై నివేదికలు పంపినట్లు చెబుతున్నారు. డిసెంబర్ నెలల్లో క్రిస్‌మస్ పండుగ తరువాత నూతన సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండగ ఉండటంతో ప్రజలు గుంపులు చేరే అవకాశ ముందని అందుకోసం కర్ఫూ విధిస్తే పరిస్థితులు అదుపులో ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు.

గత వారం రోజులుగా గ్రేటర్‌లో పాజిటివ్ కేసులు పరిశీలిస్తే ఈనెల 6వ తేదీన 78 మందికి, ఈనెల 7న 87 కేసులు, ఈనెల 8వ తేదీన 79 మందికి, ఈనెల 9న 76 కేసులు, ఈనెల 10వ తే దీన 82 మందికి, ఈనెల 11న 78, ఈనెల 12వ తేదీన 72 కేసులు నమోదైతున్నట్లు వైద్యశాఖ గణాం కాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుంటే రూ.వెయ్యి జరి మానాలు వేస్తున ప్రజల బౌతికదూరం పాటించడం లేదని, జనం నిర్లక్ష్యంతో మహమ్మారి రెక్కలు కట్టుకుం టుందన్నారు. కూరగాయలు, పండ్లు, పూల మా ర్కెట్లతో పాటు, వస్త్ర, బంగారం, హోటల్స్, టిపిన్ సెంటర్ల వద్ద ఇంకా గుంపులు చేరుతున్నారని, భౌతి కదూరం పాటించేలా దుకాణాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికల బోర్డు పెట్టిన, వైరస్ సోకితే తమకే సోకుంది మీకేందుకు ఆరాటమని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తనిఖీలో పలువురు యాజ మానులు చెప్పినట్లు వైద్య బృందాలు పేర్కొంటున్నాయి.

మొదట కేసులు బయటిపడింది పలు పాఠ శాలలు, వసతిగృహాలు కావడంతో విద్యశాఖ వైరస్ ప ట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించడంతో ప్రత్యక్ష పాఠాలు వినేందుకు చిన్నారులు ఆసక్తి చూ పడం లేదు దీంతో విద్యార్థుల హాజరుశాతం తగ్గింది. ఎల్‌కేజీ నుంచి 1వ తరగతి వరకు చిన్నారులు 50 శాతం కూడా రావడం లేదని పాఠశాల నిర్వాహకులు వెల్లడి స్తున్నారు. కరోనా ప్రభావంతో గత మూడేళ్ల నుంచి వి ద్యార్థులకు చదువులకు దూరమైయ్యారని, మళ్లీ ఒమి క్రాన్ రూపంలో థర్డ్‌వేవ్ వస్తే చిన్నారులు భవిష్యత్తు అంధకార మైతుందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News