Monday, April 29, 2024

రూపాయి పతనానికి నిర్మలాసీతారామన్ సరికొత్త భాష్యం

- Advertisement -
- Advertisement -

Nirmalasitaraman

న్యూఢిల్లీ: డాలరు మారకంతో పోల్చినప్పుడు రూపాయి విలువ సర్వకాల కనిష్టానికి రూ. 82.69కి పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సరికొత్త భాష్యం చెప్పారు. ఆమె “రూపాయి విలువ పడిపోలేదు, కాకపోతే డాలరు విలువ బలపడింది” అని వివరణ ఇచ్చారు. ఆమె అమెరికా పర్యటించినప్పుడు ఓ విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) కేవలం రూపాయి విలువలో హెచ్చుతగ్గులు(వోలాటిలిటీ) ఎక్కువ ఉండకుండా చూస్తోందని, రూపాయి విలువను నిలబెట్టేందుకు మార్కెట్ విషయంలో జోక్యం చేసుకోవడంలేదని తెలిపారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీల కన్నా భారత రూపాయి బాగానే పనిచేస్తోందని ఆమె స్వంత కితాబునిచ్చుకున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో రూపాయి విలువ దిగజారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కూడా ఇందుకు తోడయ్యాయంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News