Monday, May 6, 2024

రైతులలో ఏర్పడిన అపోహలను కేంద్రం నివృత్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

Nitish Kumar suggested that Center should allay suspicion among Farmers

 

నితీష్ కుమార్ సూచన

పాట్నా: నూతన వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర విధానం రద్దయిపోతుందని లేదా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ నిలిచిపోతుందని భయాందోళన చెందుతున్న రైతులలో అనుమానాలను కేంద్రం నివృత్తి చేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సూచించారు. అంతేగాక ఎపిఎంసి మండీల(మార్కెట్లు) వెలుపల తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుకల్పించే వ్యవసాయ చట్టంపై రైతులలో ఏర్పడిన అపోహలను కేంద్రం తొలగించాలని కూడా ఆయన కోరారు.

సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆందోళన చేస్తేన్న రైతులతో చర్చలు జరపడానికి కేంద్రం భావిస్తోందని, ఒకసారి చర్చలకు ఉభయ పక్షాలు కూర్చుంటే కనీస మద్దతు ధరపై ఏర్పడిన భయాందోళు తొలగిపోతాయని అన్నారు. 2006లోనే తమ రాష్ట్రంలో ఎపిఎంసి మండీలను రద్దు చేసి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల(సిఎసిఎస్) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు. కొత్త విధానంతోనే బీహార్‌లో సేకరణ ఊపందుకుందని, రైతులలో ఏర్పడిన అపోహలను కేంద్రం తొలగిస్తే సమస్య పరిష్కారమైపోతుందని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News