Monday, April 29, 2024

నిజాం పాలనలో విద్యాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

Deadline for admission to BEd Management Quota

ఒయు విశ్వవిద్యాలయం స్థాపన
విద్యాసదస్సులు: 1915 1919 మధ్య హైదరాబాద్ సంస్థానంలో నాలుగు విద్యా సదస్సులు జరిగాయి. అవి
1. 1915లో 1వ విద్యా సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు.
2. 1916లో 2వ విద్యా సదస్సు ఔరంగాబాద్‌లో జరిగింది.
3. 1917లో 3వ విద్యా సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించారు.
4. 1919లో 4వ విద్యా సదస్సు లాతోర్‌లో జరిగింది.
1915 మార్చి 1న హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్ మొదటి విద్యా సదస్సుకు అప్పటి నిజాం ప్రభుత్వ హోం సెక్రటరీ సర్ అక్బర్ హైదరీ అధ్యక్షత వహించాడు.
మొదటి విద్యా సదస్సు జరగటానికి ప్రధాన కారకుడు
మహ్మద్ ముర్తాజా
ఈ విద్యా సదస్సు కృషి ఫలితమే ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన.
ఓయూని తన మానస పుత్రికగా భావించి నిర్మాణం కోసం ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేసింది
సర్ అక్బర్ హైదరీ
ఉస్మానియా యూనివర్శిటీ
1917 ఏప్రిల్ 26న స్థాపనకు 7వ నిజాం ఫర్మానా జారీ చేశాడు.
1918 సెప్టెంబర్ 22 ఓయూ స్థాపన జరిగింది.
1919 ఆగస్టు 28న అబిడ్స్ అద్దె భవనంలో ఉర్ధూ భోదనా భాషగా 25 మంది సిబ్బంది 225 మంది విద్యార్థులతో ప్రారంభమైంది.
ఓయూ భవన సముదాయానికి 1400 ఎకరాలను ఎంపిక చేయడంలో నేతృత్వం వహించింది
సర్ పాట్రిక్
భారతదేశంలో మొదటి ఉర్ధూ విశ్వవిద్యాలయం
ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూ మొదటి వైస్ చాన్సలర్
హబీబ్ రెహమాన్‌ఖాన్ (191819)
ఈ విశ్వ విద్యాలయం తెలుగు భాషకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు.
1923 జులై 5న ఉస్మానియ ఆర్ట్ కళాశాల భవనానికి 7వ నిజాం శంఖుస్థాపన చేశాడు.
1938లో వివిధ యూనివర్సిటీల భవన నిర్మాణ రీతులను అధ్యయనం చేయడానికి విదేశాలకు వెల్లిన వారు
వాహబ్ జెయిన్ మార్జంగ్, సయ్యద్ అలీరాజా.
1939లో ఆర్ట్ కాలేజ్ భవనం నిర్మాణం పూర్తయింది.
1939 డిసెంబర్ 4న 7వ నిజాం ఆర్ట్ కాలేజ్ భవనం ప్రారంభించాడు.
ఆర్ట్ కాలేజ్ మొదటి ప్రిన్సిపల్
సర్‌రాస్ మసూద్
ఈ కళాశాల నిర్మాణంలో ఉపయోగించిన రాయి
పింకిష్ గ్రానైట్ రాయి
భారతీయ భాషను భోదనా భాషగా మొదటి సారి ప్రవేశ పెట్టింది
ఓయూ
ఓయూలో ఉర్ధూ బోధనా భాషగా, ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజ్‌గా తప్పనిసరి.
1949లో ఓయూ భోధనాభాషను ఉర్ధూ నుండి ఇంగ్లిషులోకి మార్చినది
ఓయూ ముల్కీలలో ఉన్నత విద్యా వ్యాప్తికి దోహదపడింది.
స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
ఓయూ విద్యా వంతులైన పౌరులను తయారు చేసే సంస్థగా మారింది.
కాని ప్రభుత్వ అధికారులను తయారు చేయలేకపోయింది.
అదే సమయంలో నిజాం కాలేజిలో ఇంగ్లిష్ మీడియం బోధన భాష ఉండేది. ఈ కాలేజీ అధికారులను తయారు చేసే నాణ్యమైన కళాశాలగా తయారైంది.
1920తొ పోల్చుకుంటే చదువు కునే వారి సంఖ్య 193538 నాటికి భాగా పెరిగింది.
1920 నుండి 1935 మధ్య కోటిరూపాయలకు పైగా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
విద్యా సంస్థల సంఖ్య 1036 నుండి 4800 లకు పెరిగింది.
విద్యా వంతుల సంఖ్య 66,484 నుండి 3, 64, 252కు పెరిగింది.
1918 నుండి 1938 వరకు సుమారు 1100 మంది ఆర్ట్ అండ్ సైన్స్ కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.
లండన్‌లో ఇంజనీరింగ్ చదివి చీఫ్ ఇంజనీర్ అయినది
నవాబ్ అలీ నవాజ్ జంగ్.
1918లో చీఫ్ ఇంజనీరింగ్ భాద్యతలు చేపట్టి నిజాంసాగర్ నిర్మించారు.
ఉర్ధూ భోదనభాషగా వుండటం వల్ల ఉద్యోగాల్లో ముస్లింల ఆధిపత్యం 1948 దాకా నిరాటంకంగా కొనసాగింది.
1947 48లో హైదరాబాద్ సంస్థానంలో గెజిటెడ్ అధికారులు 999, వీరిలో ముస్లిం గెజిటెడ్ అధికారులు
754
1931 జనాభాలో అక్షరాస్యుల సంఖ్య
3,91,317 (4.03%)
ముస్లిం జనాభాలో అక్షరాస్యుల సంఖ్య 1,58,854 (10.35%)
1939లో హిందు జనాభా 96,99,615, మస్లిం జనాభా
15,34,666
హైదరాబాద్ అసోసియేషన్:
1930లో బారిస్టర్ శ్రీకిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
ఈ సంస్థ భాద్యతాయుత మైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పాలనా సంస్కరణలు కావాలని డిమాండ్ చేసింది.
ఫర్మానా రావడానికి కారణాలు

1919లో జారీ చేసిన ఫర్మానా తర్వాత కూడా అక్కడక్కడ నాన్ ముల్కీలను స్థానిక ఉద్యోగాలలో నియమించడం జరిగింది.
1920లో ఓయూ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్, 1926లో లండన్‌లో సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రొగ్రెస్సివ్ సంస్థలను స్థాపించడం.
ఓయూలో విద్యను అభ్యసించిన విద్యార్థులు విద్యను ముగించుకున్న తర్వాత ఉద్యోగాల కొరకు ప్రయత్రం చేయగా ప్రభుత్వం నాన్‌ముల్కీలను మాత్రమే ఉద్యోగాల్లో నియమించడం.
ముల్కీలైన విద్యార్థులకు ప్రభుత్వం పట్ల నిరసన పెరిగి మరల ముల్కీ ఉద్యమానికి దారితీసింది.
1930వ మొదటి దశకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్‌సాహెబ్ హైదరాబాద్‌కు వచ్చి ఉన్నత ఉద్యోగంలో చేరడం.
స్థానికుల పదోన్నతలు దెబ్బతిని మళ్లీ ముల్కీ ఉద్యమం బలంగా ప్రారంభం కావడం.
1933 ఫర్మానా
ముల్కీ ఉద్యమాన్ని చల్లార్చడానికి 7వ నిజాం 1933 ఫర్మానా జారీ చేశాడు.
నిజాం రాజు 1933 ఫర్మానా ద్వారా రాష్ట్ర ఉద్యోగ నియామకాలలో సమర్థవంతమైన, విద్యా వంతులైన ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వాలని హుకుం జారీ చేశాడు.
ముల్కీలకు ఆనాటి కొత్వా ల్ రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి అనేక విధాలుగా మద్ద తు ఇచ్చారు.
1919 ఫర్మా నా, 1933 ఫ ర్మానాలు ము ల్కీ నిర్వచనం పూర్తి స్థాయిలో ఇచ్చినవి.

వెంకటరాజం బొడ్డుపల్లి,
రామప్ప అకాడమీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News