Saturday, April 27, 2024

కరోనాపై కంగారొద్దు

- Advertisement -
- Advertisement -

Corona

 

నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇప్పటికే వైరస్‌పై అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన్నప్పటికి, మాస్కుల కోసం ప్రజలు అతృత పడటం ఆందోళనకరమన్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగిని మంత్రి శనివారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ఎట్టి పరిస్థితిలో భయపడవద్దని ,ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందించి పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటికి తీసుకు వస్తామని రోగికి భరోసా ఇచ్చారు. అనుమానిత లక్షణాలు ఉండి గాంధీలో పరీక్షలు నిర్వహించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మంత్రి మాట్లాడారు. కరోనా వైరస్ వార్డు వద్ద ఉన్నప్పుడు మాత్రమే మంత్రి మాస్కులు ధరించి వెళ్లారు. ఇతర వార్డుల్లో మాస్కులు లేకుండానే మంత్రి ఆసుపత్రిని పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి లో శనివారం 7 ఫ్లోర్లలో డిఎంఇ డా రమేష్‌రెడ్డి, డిహెచ్ డా శ్రీనివాసరావు, గాంధీ ఆసుపత్రి వైద్యులతో కలసి తిరిగారు.

కరోనాపై అపోహాలు తొలగిపోయేందుకు కృషి చేస్తున్నాం
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పనిచేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చైనా కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కరోనా వైరస్ సోకితే ఇక చావే శరణ్యం అన్నట్లుగా ప్రచారం జరిగిందని దాంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజల్లో భరోసా కలగనిదే వారిలో ఆందోళనలు తగ్గే అవకాశం లేదని, దీనిలో భాగంగానే కరోనా వైరస్ పట్ల ఒక పక్క వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోపక్క వైరస్ సోకితే అందించాల్సిన చికిత్స పట్ల సిఎం సలహాలు, సూచనలతో పూర్తిస్థాయిలో నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ క్రమంలో ప్రతిరోజు పూర్తి వివరాలతో ప్రజలకు సమాచారం ఇస్తున్నానని, దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేర్చేందుకు నిత్యం కృషి చేస్తున్న మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరు 24 గంటలు పనిచేశారని మంత్రి తెలిపారు. అయితే ఇంత చెప్తున్నా మాస్కుల కోసం ప్రజలు పడుతున్న అతృత, కరుణ వైరస్ పై సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం తో ఇంకా ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు.

బాధ్యత మరచిపోవద్దు
డాక్టర్లుగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మరచిపోయి, ఆందోళన చెందటం ఎంతవరకు సమంజసమని మంత్రి జూడాలను ప్రశ్నించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది తప్పా, ఐసొలేషన్ వార్డు ఇక్కడ ఉండటం వల్ల ఏ ఒక్కరికి కరోనా వైరస్ సొకదని స్పష్టం చేయడానికి మాత్రమే తాను ఇక్కడికి వచ్చానన్నారు. మంత్రిగా తానే వచ్చినప్పుడు డాక్టర్ గా జూడాలు భయపడటం లో అర్థం లేదని వివరించారు.

గాంధీలో కరోనా ఏర్పాట్లుపై చర్చ….
గాంధీ హాస్పిటల్ లో కరోనా వార్డు ల్లో ఏర్పాట్లపై శనివారం మంత్రి డాక్టర్లతో చర్చించారు. కరోనా వైరస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు కు వెళ్ళే దారిలో ఏ ఒక్కరిని కూడా అనుమతించవద్దని పూర్తిగా వైరస్ సోకిన వారు రావడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలని డాక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు . లిఫ్ట్ కూడా వైరస్ సోకిన వారిని తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఉపయోగించాలని, హాస్పిటల్ లో మిగతా పేషెంట్లు ఎవరు కూడా ఈ కరోనా వైరస్ సోకిన వారిని ఉంచే వార్డులకు వెళ్ళడానికి వీలులేకుండా దారులు మూసివేయాలని మంత్రి సూచనలు చేశారు.

ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్ సిబ్బంది లిఫ్ట్ లను, వార్డ్ లను ఆల్కహాల్ బేస్డ్ క్లీనర్ల తో శుభ్రం చేయాలని మంత్రి కోరారు. ఐసోలేషన్ వార్డులో ఉన్నవారు చాలామంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఉండడంతో వారికి వైఫై సౌకర్యం కూడా కల్పించాలని గాంధీ అధికారులతో మంత్రి చెప్పారు. మీడియా కూడా సంయమనం పాటించాలని వైరస్ సోకిందని అనుమానం ఉన్న వారందరికీ పాజిటివ్ వచ్చే అవకాశం లేదని, ఇప్పటి వరకు ఒకే ఒక్కరు మాత్రమే తెలంగాణలో పాజిటివ్ గా నమోదు అయ్యారని మిగతా వారికి వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించి, రాష్ట్ర ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడతమని మంత్రి హామీ ఇచ్చారు.

No worries on Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News