Monday, April 29, 2024

టెన్నీస్ స్టార్ జకోవిచ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు

- Advertisement -
- Advertisement -

Novak Djokovic

బెల్‌గ్రేడ్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ క్రీడాకారుడు, సెర్బియా స్టోర్ నొవాక్ జకోవిచ్‌కు కరోనా సోకింది. ఇంతకుముందు అతని వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. తాజాగా జకోవిచ్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జకోవిచ్ స్వయంగా ప్రకటించాడు. కొన్ని రోజులుగా జ్వరం ఉండడంతో తాను వైద్య పరీక్షలు చేయించుకున్నానని, ఇందులో కరోనా ఉన్నట్టు తేలిందని జకోవిచ్ వెల్లడించాడు. తాను ఇటీవలే బెల్‌గ్రేడ్‌కు వచ్చానని, వచ్చిన వెంటనే తనతో పాటు భార్యకు కరోనా పరీక్షలు చేయించానని తెలిపాడు. ఇందులో ఇద్దరికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నాడు. అయితే జకోవిచ్ పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది. కాగా, జకోవిచ్ అతని భార్య ఇద్దరు కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆటపై దృష్టి పెడతానని జకోవిచ్ వివరించాడు. ఇక, కరోనా నుంచి తాము కోలుకునేలా ప్రార్థన చేయాలని అభిమానులను కోరాడు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ మహమ్మరి సాధ్యమైనంత త్వరగా అంతం కావాలని జకోవిచ్ అభిలాషించాడు.

ఆందోళనలో అభిమానులు
ఇదిలావుండగా తమ అభిమాన స్టార్ జకోవిచ్‌కు, అతని భార్యకు కరోనా సోకడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జకోవిచ్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేగాక ఈ మహమ్మరి బారి నుంచి వీరిద్దరూ సురక్షితంగా బయట పడాలని వారు కోరుకుంటున్నారు. మరోవైపు జకోవిచ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సెర్బియా వ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా ఇంతకుముందు బల్గేరియాకు చెందిన గ్రిగర్ దిమిత్రోవ్‌కు కూడా కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే.

Novak Djokovic tests positive for coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News