Monday, April 29, 2024

టెన్నిస్ ‘రారాజు’ జకోవిచ్

- Advertisement -
- Advertisement -

Novak Djokovic Wins His 20th Career Grand Slam Title

 

లండన్: ప్రపంచ టెన్నిస్‌లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల టెన్నిస్‌లోని పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంటూ ఎదురులేని శక్తిగా మారాడు. చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్)లతో పోల్చితే ప్రపంచ టెన్నిస్‌లో జకోవిచ్ అత్యంత విజయవంతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. దీనికి అతను సాధిస్తున్న వరుస గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కూడా సాధిస్తే జకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో కొత్త ఆధ్యాయానికి తెరలేపుతాడు. జకోవిచ్ ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్, ఫెదరర్‌లతో కలిసి సంయుక్తంగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక రానున్న రోజుల్లో జకోవిచ్ వీరిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమనే చెప్పాలి. వయసు పెరగడంతో ఫెదరర్‌కు మరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో తేలికేం కాదు. ఇక నాదల్ కూడా కేవలం ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలతోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా నాదల్‌ను జకోవిచ్ మట్టికరిపించాడు. ఇలాంటి స్థితిలో జకోవిచ్ జోరును అడ్డుకోవడం నాదల్‌కు కూడా చాలా కష్టమేనని చెప్పక తప్పదు. ఈ ఏడాది రఫెల్ అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. తనకు ఎదురులేని ఫ్రెంచ్ ఓపెన్‌లోనే జకోవిచ్ చేతిలో కంగుతిన్నాడు. ఈ పరిస్థితుల్లో యూఎస్ ఓపెన్‌లో సెర్బియా యోధుడి జోరుకు ఎదురునిలువడం సులువేం కాదు. యువ ఆటగాళ్లు డొమినిక్ థిమ్, జ్వరేవ్, సిట్సిపాస్, మెద్వెదేవ్, బెరెటిని తదితరులు కూడా జకోవిచ్‌కు కనీస పోటీ ఇవ్వలేక పోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో జకోవిచ్ మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా చారిత్రక విజయం సాధించిన వరల్డ్ నంబర్‌వన్ జకోవిచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అతన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్విట్లు వెల్లువెత్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News