Monday, April 29, 2024

అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

- Advertisement -
- Advertisement -

 

బీజింగ్ : దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి తమ అనుమతి లేకుండా అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధ నౌకను తరిమి కొట్టామని సోమవారం చైనా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చి సోమవారానికి సరిగ్గా ఐదేళ్లు గడచిన వేళ చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. 2016 జులై 12న అంతర్జాతీయ న్యాయస్థానం (పెర్మనెంట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ) తీర్పు వెలువరించగా, చైనా మిలిటరీ కూడా జులై 12 నే ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా యుద్ధనౌక యుఎస్‌ఎస్ బెస్‌ఫోల్డ్ చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా దక్షిణ చైనా సముద్రం లోని పరాసెల్స్ ద్వీపం సమీపం లోకి చొరబడిందని చైనా ప్రకటించింది.

ఇది చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా, దక్షిణ చైనా సముద్రంలో అస్థిర పరిస్థితులను సృష్టించడమేనని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన దక్షిణ థియేటర్ కమాండ్ తెలియచేసింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను అమెరికా తక్షణం కట్టిపెట్టాలని అమెరికాను కోరుతున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే దీనిపై అమెరికా ఇంతవరకు స్పందించ లేదు. దక్షిణ చైనా సముద్రం లోని పరాసెల్ ద్వీపాలు కొన్నేళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఉంటున్నాయి. అనేక సహజ వనరులకు, పగడాల దీవులకు నెలవైన చైనా , ఈ దీవులపై తమకే హక్కులని చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు చారిత్రకంగ తమకే హక్కని వాదించుకుంటున్నాయి. అయితే జులై 12,2016 లో హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఆ దీవులపై చైనాకు చారిత్రకంగా ఎలాంటి హక్కు లేదని తీర్పునిచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News