Thursday, May 9, 2024

మంచి కంటెంట్‌తో…

- Advertisement -
- Advertisement -

Oh Madhu film

బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ.యం.ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, ఆడిషినల్ ఎస్పీ లక్ష్మణ్ తదితరులు హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు చిత్ర నిర్మాత ఏ.యం.ఖాన్ మాట్లాడుతూ దర్శకుడు మంచి కంటెంట్‌తో సినిమాను అద్భుతంగా తీశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్రార్ ఖాన్, ఐశ్వర్య, రాజారెడ్డి పానుగంటి, వాజిద్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News