Monday, April 29, 2024

ఓలా స్కూటర్స్ బుకింగ్ బంపర్ హిట్

- Advertisement -
- Advertisement -
Ola Scooters booking bumper hit
24 గంటల్లో లక్ష స్కూటర్లకు బుకింగ్‌లు

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్‌లు ప్రారంభమైన 24 గంటల్లోనే లక్ష మంది రిజర్వ్ చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్‌లు శుక్రవారం ప్రారంభమైనాయి. ఓలా ఎలక్ట్రిక్. కామ్‌లో రూ.499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులనుంచి అందిన స్పందనపై ఓలా చైర్మన్, గ్రూపు సిఇఓ భావిష్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.

Ola Scooters booking bumper hit

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News