Monday, April 29, 2024

హరితహారంలో వందశాతం లక్షాన్ని సాధించాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: హరితహరంలో వందశాతం లక్షాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు పలు సూచనలు చే శారు. మంగళవారం కలెక్టర్ వివిధ అంశాలపై జి ల్లా అదికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలతో కలిసి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు 30వేల కూలీలను ఏర్పాటు చేయాలని, వారంలో ఖచ్చిత ంగా 8 లక్షల మొక్కలు నాటి వేగవంతంగా మొ క్కలు నాటాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు భాగంగా కొత్త ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలన్నా రు. అలాగే గ్యాప్ ప్లాంటేషన్ గుర్తించి అటవీశాఖ, డిఆర్‌డిఏ శాఖ తమతమ టార్గెట్‌లను పూర్తి చే యాలన్నారు. ఈజిఎస్ వర్కర్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని, లేబర్ మొబలైజేషన్ ఎక్కువ గా ఉండాలన్నారు. ఈజీఎస్‌లో వందశాతం గు ంతలు తవ్వించాలని సూచించారు. సంపద వనాలు(దశాబ్ది వనాలు)ఏర్పాటు చేయడంపై దృష్టి సా రించాలన్నారు.

 

సంపద వనాలకు 70 బ్లోక్స్ సం బంధించి 167 ఎకరాలు గుర్తించామని, 24 బ్లో క్స్‌లో ప్లాంటేషన్‌కు అనుకూలత లేదని, ఎంపిడిఓ లు రిపోర్ట్ ఇచ్చారని, డిపిఓ, డిఎఫ్‌ఓ, జాయింట్ ఇన్సెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూమిలలో ఎంక్రోమెంట్‌ను గుర్తించి సంపద వనాలకు ప్లాంటేషన్ జరగాలని తెలిపారు. పిఆర్‌రోడ్, బీ రోడ్, ఎన్‌హెచ్ రోడ్డుకి ఇరువైపులా ప్లాం టేషన్ జరగాలని తెలిపారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలని, తెలంగాణ క్రీడా ప్రాంగణము, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు చుట్టూ బయోఫెన్సింగ్ వేయాలని సూచించారు. గ్రామపంచాయతీ మొదలు జిల్లా స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో మొక్కలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో ఇంటింటికి మొక్కలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ఎన్ని మొక్కలు ఇచ్చాం ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఇచ్చిన మొక్కల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా లక్షాన్ని పూర్తి చేయాలన్నారు.

మంజూరైన అన్ని గ్రామపంచాయతీ భవనాలు ఈ వారంలోగా గ్రౌండింగ్ చేయాలని ఎంపిడిఓలు, ఎంపిఓలకు ఆదేశించారు. అన్ని వైకుంఠదామాలకు విద్యుత్, నీటి కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహయంకు సంబందించి కులవృత్తులకు సంబందించి, కులవృత్తులు కాకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు అర్హతగల వారి దరఖాస్తులను త్వరితగతిన ఆన్‌లైన్‌లో పంపాలన్నారు. ఈ టెలికాన్పరెన్స్‌లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, పిడి డిఆర్‌డిఏ శ్రీనివాస్, డిఎఫ్‌ఓ రవిప్రసాద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, డిఎల్‌పిఓలు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఎపిఓలు, ఏవోలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News