Saturday, April 27, 2024

లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

One Lakh Fifty Thousand jobs in Five Years

వనపర్తి: ఆరేండ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షా 50 వేల ఉద్యోగాఉలు ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గోపాల్‌పేటలో పట్టభద్రులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మరో యాబై వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. టిఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆరున్నరేండ్లలో పద్నాలుగు వేల పరిశ్రమలతో పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించామని స్పష్టం చేశారు. ప్రతినెలా నలబై లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఏడాదికి రెండు సార్లు ఆరువై లక్షల మందికి రైతు బంధు, 32 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం చెల్లిస్తోందన్నారు. ఏడాదికి ప్రభుత్వం 50 వేల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నుంచిఏడేండ్లలో తెలంగాణకు ఒక ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రభుత్వం సంస్థల్ని ప్రైవేటుపరం చేయడం వల్ల బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయని చెప్పామని, తెచ్చి చూపించామని, తెలంగాణలో మాదిరిగా దేశంలో ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఆరేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలు కల్పించారా? నిరంజన్ రెడ్డి అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News