Monday, April 29, 2024

ఆటో డ్రైవర్లకు ఆన్‌లైన్ కష్టాలు

- Advertisement -
- Advertisement -

online difficulties for auto drivers in hyderabad

మీటర్ సీలింగ్ కేంద్రాల్లో
ఆఫ్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉంచాలి

హైదరాబాద్: నగరంలో ఉన్న సుమారు 1 లక్షా 30 వేల ఆటోలు ఉన్నా యి. ప్రతి సంవత్సరం తూనికలు, కొలతల శాఖ పరిధిలోని అత్తాపూర్, సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలోని కేంద్రాలకు వెళ్ళి రూ.150 చెల్లించి ఆటోల మీటర్లకు సీలింగ్‌ను తప్పకుండా వేయించుకోవాలి. లేని పక్షంలో సదరు అధికారులు తనిఖీల సమయంలో వీటిని గుర్తిసే భారీ ఎత్తున ఫైన్ విధించడమే కాకుండా కొన్ని సందర్భాల్లో సదరు ఆటోలను కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. తూనికలు కొలతశాఖ అధికారులు ఆటో మీటర్ సిలింగ్ కేంద్రాలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకువచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తప్పు లేదు. కాని ఆటో డ్రైవర్లులో అనేక ముంది 5 నుంచి 8 తరగతి చదువుకున్నవారే అధికంగా ఉన్నారు. వారిలో అనేక మందికి ఆన్‌లైన్ సేవలపై అవగాహన లేదు. అంతే కాకుండా కొంత మంది ఆటో డ్రైవర్ల వద్ద బేసిక్ ఫోన్ మినహా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండవు.

ఒక వేళ ఉన్నా వాటిని వినియోగించడం రాదు.ఇటువంటి సమయంలో ఆటో మీటర్ సీలింగ్ కేంద్రాల్లో ఆన్‌లైన్ సేవలను ప్రవేశ పెట్టడంతో ఆటోడ్రైవర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇందులో అధికారులు ఒక ప్రత్యేకమైన నిబంధన విధించారు. ఇంధులో భాగంగా ఆన్‌లైన్ మీటర్ సిలింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే సదరు అధికారి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉన్న సేవా కేంద్రానికి వెళ్ళాల్సి ఉం టుంది. నగరంలో ఉన్న 1 లక్షా 30 వేల ఆటోలకు ఉన్నదే రెండు మీటర్ సిలింగ్ కేంద్రాలు అలాంటిది సదరు అధికారి అందుబాటులో ఉన్నప్పుడే స్లాట్‌బుక్ చేసుకోవాలనడం ఎంత వరకు సబబని ఆటో యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్ పాటు ఆఫ్ లైన్ కూడా అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్లు స్లాట్ బుక్ చేసుకోవడం కూడా రాదని, అటువంటి వారి కోసం ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాడమే కాకుండా ఆన్‌లైన్ సేవలపై ఆటో డ్రైవర్లుకు అవగాహన కల్పించిన అనంతరం మీటర్ సీలింగ్ కేం ద్రాల్లో ఆన్‌లైన్ ప్రవేశపెట్టాలంటున్నారు.

మీటర్ సీలింగ్ కేంద్రాలను పెంచాలి : ఆర్ల సత్తిరెడ్డి

నగరంలో ఉన్న రెండు మీటర్ సీలింగ్ కేంద్రాలు ఏ మాత్రం సరిపోవడం లేదని, వాటి సంఖ్యను పెంచాలని ఆటోయూనియన్ నాయకులు ఆర్లసత్తిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తాము ఎంతో దూరం నుంచి ఈ కేంద్రాలకు వస్తుంటామని అటువంటి సమయంలో ఆ రోజు వచ్చే ఆదాయం కోల్పోవడమే కాకుండా సమయం కూడా వృథా అవుతుందంటున్నారు. గతంలో సికింద్రాబాద్‌లో ఆటో మీటర్ సీలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా అది ఇంత వరకు కార్యారూపం దాల్చలేదన్నారు. ఆటో మీటర్ సిలింగ్‌కు సంబంధించిన బాధ్యతను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 రవాణాశాఖ కార్యాలయాలకు అప్పగిస్తే పని సులభం అవుతుందని అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా ఆటో డ్రైవర్లు ఎక్కడివారు అక్కడే మీటర్ సీలింగ్ వేయించు కోవడంతో అటు అధికారులకు, ఇటు ఆటో డ్రైవర్లకు సమయం, డబ్బు వృథా కాదంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News