Monday, April 29, 2024

అఫిడవిట్లపై ప్రత్యర్థుల ఫోకస్…

- Advertisement -
- Advertisement -

ఆస్తులు,కేసుల వివరాలను పరిశీలిస్తున్న విపక్ష అభ్యర్థులు
తప్పు దొరికితే న్యాయం చుట్టూ తిప్పేందుకు కుట్రలు
గత ఎన్నికల్లో కేసులు ఎదుర్కొన్న 16 మంది ఎమ్మెల్యేలు
నామినేషన్ల ప్రారంభం నుంచి ఆడిటర్లతో వివరాలు సేకరణ
నామినేషన్ పత్రాలు జాగ్రత్తగా నింపాలని పార్టీ పెద్దల సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచి ప్రచారంలో దూసుకపోతున్నారు. మరోపక్క తమ ప్రత్యర్థులు నామినేషన్ పత్రాలల్లో పేర్కొన ఆస్తులు, కేసుల వివరాలను సేకరిస్తూ వాటిపై ఆరా తీస్తున్నారు. ఈఎన్నికల్లో ఓటమి చెందితే గెలుపోందిన అ-భ్యర్థిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించాడు అంటూ న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు కుట్రలకు తెర లేపుతున్నారు. గెలిచిన అభ్యర్థి ప్రజా సేవ చేయకుండా అక్రమ మార్గంలో విజయం సాధించాడని ప్రచారం చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు.

గత ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యతో ఎన్నికల రద్దు చేసే పరిస్థితి వరకు వచ్చారు. దీనిపై ఉన్నత న్యాయస్ధానానికి వెళ్లి మధ్యంతర స్టే తెచ్చుకుని తీర్పును వాయిదా వేయించుకున్నారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, బిఎస్పీలకు చెందిన అభ్యర్థుల వివరాలను ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రత్యేక ఆడిటర్, న్యాయవాదిని ఏర్పాటు చేసుకుని ఆఫిడవిట్ వివరాలు తీసుకుని అవి మేరకు సరిగ్గ ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తూ లోపాలు గుర్తించి ఎన్నికల రద్దు కార్యక్రమాలకు పూ-నుకుంటున్నారు. అన్ని పార్టీల కంటే ముందు టికెట్లు ప్రకటించిన గులాబీ బాసు, సిఎం కెసిఆర్ భిపామ్‌లు అందజేసే సమయంలో నామినేషన్లు పత్రాలల్లో తప్పుడు వివరాలు నమోదు చేయకుండా సక్రమంగా భర్తీ చేసి ప్రత్యర్థులకు దొరకకుండా జాగ్రత్తలు పాటించాలని అభ్యర్థులకు సూచించారు.

అదే విధంగా రెండు రోజుల కితం బిజెపి అధ్యక్షులు కిషన్‌రెడ్డి 100 మంది అభ్యర్థులకు ఏఫామ్, బిఫామ్‌లు ఇచ్చి నామినేషన్ల పత్రాలు సక్రమంగా నిలపాలని, ఆఫిడవిట్‌లో తప్పులు లేకుండా చూసుకోవాలని అజాగ్రత్తంగా ఉంటే విజయం సాధించిన తరువాత కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముందని అభ్యర్థులను హెచ్చరించారు. బిఎస్పీ చీప్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి టికెట్లు కేటాయించిన అభ్యర్థులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి రాత్రి 9 గంటలకు గ్రూపు కాల్ ద్వారా ఏవిధంగా నామినేషన్లు వేయాలని, ఏసమయానికి ఎన్నికల కార్యాలయాలకు వెళ్లాలో వంటి వివరాలను ఈనెల 3వ తేదీ నుంచి సూచిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎఐసిసి నాయకులు, రాష్ట్ర ఇంచార్జీలు కూడా భిపామ్ అభ్యర్థులకు అందజేసేటప్పుడు నామినేషన్ల విషయంలో నిర్లక్షం వహించకుండా ఒకటి రెండుసార్లు పరిశీలన చేసి ఆస్తులు, కేసులు వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని పేర్కొన్నట్లు ఆపార్టీకి చెందిన అభ్యర్థులు వెల్లడించారు. దీంతో వారంతా ముందుగా ఆడిటర్, న్యాయవాదితో నామినేషన్ పత్రాలు నింపి ఎన్నికల అధికారులు సమర్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే నాయకుల ఆఫిడవిట్లకు సంబంధించిన వివరాలు తీసుకోవడంపై ఎన్నికల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు రాజకీయాలు మారిపోతున్నాయని ఎద్దేవా చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News