Monday, April 29, 2024

అన్నంలో బల్లి: 100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలోని ఒక ప్రైవేట్ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు, తలనొప్పితో బాధపడినట్లు అధికారులు గురువారం తెలిపారు.

భోజనంలో బల్లి కనిపించినట్లు విద్యార్థులు చెబుతున్నారని వారు తెలిపారు. వెంటనే 65 మంది విద్యార్థులను పశ్చిమ బెంగాల్ బీర్బమ్ జిల్లాలోని రాంపూర్హట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. మరో 45 విద్యార్థులను పకూరియా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ ఎంకె టెక్రివాల్ చెప్పారు. రాంపూర్హట్ ఆసుపత్రిలో ఇంకా ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, మిగిలిన విద్యార్థులను డిశ్చార్జ్ చేశారని ఆయన తెలిపారు. ఆహారంలో బల్లి పడిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయవలసి ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News